గురువు.. శిష్యుల మధ్య నడుస్తున్న పొలిటికల్ వార్ లో.. శిష్యుడు ఇస్తున్న షాక్ లతో గురువు బేజారెత్తి పోతున్న పరిస్థితి. ఒకప్పుడు తన శిష్య పరమాణువుగా ఉన్న కేసీఆర్.. నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా తన సత్తా చాటుతూ.. నాటి గురువు.. టీడీపీ అధినేత.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్నారు. ఆయన షురూ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ పుణ్యమా అని మెజార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు టీఆర్ ఎస్ లోకి చేరిపోయారు. మొత్తం 15 మంది ఎమ్మెల్యేల్లో 9 మంది అధికారపార్టీ తీర్థం పుచ్చుకోగా.. మరొకరు పార్టీతో సంబంధం లేకుండా తన మానాన తాను (బీసీ ఉద్యమ నేత కృష్ణయ్య) అన్నట్లుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక మిగిలిన ఐదుగురిలో ఇద్దరు వరకూ జంప్ కావటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లోని అధికారపక్షాలకు అధినేతలుగా వ్యవహరిస్తున్న ఇద్దరు చంద్రుళ్లు ఒక డీల్ కుదుర్చుకుంటే ఎంత బాగుండన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో సరదా చర్చ నడుస్తోంది. తాము చెబుతున్న డీల్ కాని ఓకే అయితే.. తెలంగాణలో చక్రం తిప్పాలన్న చంద్రబాబు కోరిక తీరిపోతుందని.. అదే సమయంలో ఏపీలో పార్టీని విస్తరించాలన్న కాల్పనిక ఊహాను చతురతతో తెర మీదకు తెస్తూ ఉండే కేటీఆర్ కల కూడా నెరవేరే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీనికల్లా ఉభయులు తమ పార్టీలను ఒకరికొకరు అనుబంధ పార్టీలుగా మార్చేలా నిర్ణయం తీసుకుంటే సరి అని తేల్చేస్తున్నారు.
తెలంగాణలో పార్టీ నామరూపాల్లేకుండా పోతున్న ప్రస్తుత తరుణంలో.. టీటీడీపీని తెలంగాణ అధికారపక్షానికి అనుబంధ పార్టీగా మార్చేయటం.. అదే సమయంలో ఏపీ అధికారపక్షానికి టీఆర్ ఎస్ ను అనుబంధ పార్టీగా మార్చేస్తే ఎంతబాగుండు అంటూ ఫాంటసీ ఆలోచనను సదరు నేతలు వ్యక్తం చేయటం గమనార్హం. తమ పార్టీకి ఏపీలో అభిమానులు చాలామందే ఉన్నారంటూ ఈ మధ్య కాలంలో ఒకటికి రెండుసార్లు పైనే వ్యాఖ్యానించిన కేటీఆర్.. టీఆర్ ఎస్ ను తెలుగు రాష్ట్ర సమితిగా మార్చాలేమో అని కామెడీగా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. ఆయన వ్యాఖ్యల్ని నిజం చేయటం పెద్ద కష్టమేమీ కాదని.. తెలంగాణలో పార్టీ అధికారం కోసం బాబు వృధా ప్రయత్నం చేసే కన్నా.. ఒకప్పటి తన శిష్యుడితో మాట్లాడి డీల్ కుదుర్చుకుంటే సింఫుల్ గా సరిపోతుంది కదా అంటూ సరదాగా వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. ఒకవేళ అలా చేస్తే బాబు కల నెరవేరటమే కాదు..ఎలాంటి శ్రమ లేకుండా తెలంగాణ రాష్ట్రంలో అధికారపక్షంగా మారిపోవచ్చంటూ తమ ఊహాల్ని మాటల్లోకి మార్చేస్తున్నారు.
అదే సమయంలో.. ఏపీలో తమ పార్టీ పాగా వేయాలన్న ఫాంటసీ ఆలోచనను కేటీఆర్ కామెడీగా చెప్పాల్సిన అవసరం లేదని.. తాము చెప్పినట్లు చేస్తే.. ఏపీ అధికారపక్షంగా అవతరించొచ్చు కదా అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. తాము చెప్పేది ఆచరణలో కష్టమేమీ కాదని.. బాబుతో డీల్ కుదుర్చుకొని తెలుగుదేశం పార్టీకి అనుబంధ పార్టీగా మారితే.. పార్టీ పేరు మార్చే అవసరం లేకుండానే ఏపీ అధికారపక్షంగా అయిపోవచ్చన్న మాటను చెబుతున్నారు. ఇలాంటివన్నీ కేవలం మాటల్లోకి మాత్రమే సాధ్యమన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో.