టీఆర్ ఎస్ ను ప్రజలు అఖండ మెజార్టీతో గెలిపించారు. 90మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు. ప్రస్తుతానికి ఉన్న 31 జిల్లాలకు జిల్లాకో పదవి అయినా కంపల్సరీగా ఇవ్వాలి. ఆ జిల్లాలో అభివృద్ధి ఇతర కార్యక్రమాలు ప్రొటోకాల్ ప్రకారం అధికారికంగా ఆ మంత్రుల చేతులమీదుగానే కొనసాగాలి.. ఇప్పుడు ఇదే తాపత్రయం ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఉంది.
ఈ దఫా ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వలస వచ్చిన వారు.. టీఆర్ ఎస్ లో ఆది నుంచి ఉన్న వారు , సీనియర్లు సహా చాలా మంది మంత్రి పదవుల కోసం లైన్లో ఉన్నారు. వారందరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. తెలంగాణలో మొత్తం 18 మంత్రి పదవులకు ఇప్పటికే సీఎంగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ భర్తీ అయ్యారు. ఇక మిగిలింది 16 మంత్రి సీట్లే. 90 మందిలో 16మందిని అదీ సామాజిక సమీకరణాలను, మహిళల కోటాను అనుసరించి ఎంపిక చేయడం కత్తిమీద సామే. అందుకే కేసీఆర్ ఈ దఫా మంత్రి పదవులను జాప్యం చేస్తున్నారు.
తాజాగా అందరినీ సంతృప్తి పరిచేందుకు పోయిన సారి ప్రయోగించిన పార్లమెంటరీ కార్యదర్శుల పోస్టులను కేసీఆర్ తెరపైకి తెచ్చారు. గడిచిన సారి ఈ ఎత్తుగడ న్యాయ సమీక్షకు నిలబడక ఆ పదవులు రద్దు అయ్యాయి. ఈసారి మాత్రం కేసీఆర్ పకడ్బందీ ప్లాన్ వేశారు. ఇతర రాష్ట్రాల్లో పార్లమెంటరీ రాజకీయ కార్యదర్శుల నియామాకాలను పరిశీలించి న్యాయ సమీక్షకు దొరక్కుండా దాన్ని యథాతథంగా అమలు చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకోసం ఇప్పటికే అంతా సిద్ధం చేశారు.
ఇలా 16మంది మంత్రులు, మిగతా జిల్లాకు ఒకరు చొప్పున రాజకీయ కార్యదర్శుల నియామకాలను ఎట్టిపరిస్థితుల్లోనూ నియమించాలని కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. మరి ఆయన రెండో దఫా చేస్తున్న ప్రయత్నం న్యాయసమీక్షకు నిలబడుతుందా లేదా.. టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలకు పదవులు దక్కుతాయా అన్నది వేచి చూడాల్సిందే..
Full View