దేశంలో ఈ మహమ్మారి తీవ్రత రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ..తాజాగా మరోసారి ప్రధాని మోదీ దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వ్యాప్తి తరువాత మోదీ వీడియో సమావేశం నిర్వహించడం ఐదో సారి కావడం గమనార్హం. ఇకపోతే , ఈ సమావేశం చాలా సుదీర్ఘంగా సాగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ..ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించవద్దని , తన అభిప్రాయాలను వెల్లడించారు. దశల వారీగా ప్రయాణికుల రైళ్లను నడిపేందుకు కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కీలక ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రైళ్లను అప్పుడే ప్రారంభించవద్దని కోరిన కేసీఆర్ అందుకు కీలక కారణాలను కూడా వివరించారు.
రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్ చేయడం సాధ్యం కాదని చెప్పారు. అంతే కాకుండా దేశంలో ప్రధాన నగరాల్లోనే ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఇప్పుడప్పుడే మహమ్మారి మనల్ని వదిలి పోయేలా కనిపించడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ వైరస్ తో కలిసి బతకడం తప్పదేమోనని వ్యాఖ్యానించారు. మహమ్మారి వ్యాప్తి నియంత్రణకు కేంద్రం, రాష్ట్రాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. అయితే , మహమ్మారి వ్యాప్తి తరువాత కేంద్రం తీసుకున్న నిర్ణయం పై తొలిసారి తెలంగాణ సీఎం కేసీఆర్ అసహనం వ్యక్తం చేసారు.
అలాగే, ఈ వైరస్ వ్యాక్సిన్ ఇండియా నుంచే వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. ఈ అంశానికి సంబంధించి హైదరాబాదులో ఉన్న కంపెనీలు కూడా కృషి చేస్తున్నాయని తెలిపారు. జూలై లేదా ఆగస్టు నెలల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అన్నారు. వైద్య పరంగా సర్వ సన్నద్ధంగా ఉన్నామని... అవసరమైన మందులు - పీపీఈ కిట్లు - మాస్కులు - వైద్య పరికరాలు ఉన్నాయని చెప్పారు. అలాగే కరోనా తో కలిసి జీవించడం నేర్చుకోవాలని అన్నారు. అలాగే ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ..ఆ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోకి అనుమతించాలని అన్నారు.