ఇంకొకాయ‌న‌కు కేసీఆర్ సాష్టాంగ న‌మ‌స్కారం!

Update: 2018-12-24 04:10 GMT
కాంగ్రెస్ - బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు లక్ష్యంగా టీఆర్‌ ఎస్ అధినేత - ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు దేశవ్యాప్త పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఆదివారం ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయల్దేరారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు ప్రత్యేక విమానంలో విశాఖపట్నం చేరుకున్న సంద‌ర్భంగా కేసీఆర్‌ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంత‌రం సీఎం కేసీఆర్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో తన కుటుంబసభ్యులతో కలిసి విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి స్వరూపానంద ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేయనున్నారు. సాయంత్రం 4.30గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్‌ కు వెళ్లారు.

విశాఖలోని చినముషిడివాడలోని శారదా పీఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కు శారదాపీఠం ప్రతినిధులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి స్వరూపానందేంద్రతో కలిసి కేసీఆర్ రాజశ్యామల పూజలు చేశారు. శారదాపీఠం ఆవరణలో ఉన్న శమీ వృక్షానికి - విజయ హనుమాన్‌ కు కేసీఆర్ దంపతులు పూజలు చేశారు. ఈ సంద‌ర్భంగా స్వ‌రూపానందేంద్ర స్వామీజీకి కేసీఆర్ సాష్టాంగా న‌మ‌స్కారం చేశారు. ఆశ్ర‌మంలో పూజ‌ల అనంతరం కేసీఆర్ ఓడిశాకు బ‌య‌ల్దేరి వెళ్లారు. అక్క‌డ సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్‌ తో స‌మావేశం అయ్యారు.

కాగా, గతంలో కేసీఆర్ ఆంధ్రాకు వెళ్లినప్పుడు అక్కడ భారీ సైజ్ ఫ్లెక్సీలు - పెద్ద పెద్ద బ్యానర్లతో అక్కడి అభిమానుల నుంచి ఎంత ఘన స్వాగతం లభించిన‌ట్లే ఆదివారం విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ లోని కేసీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు - బ్యానర్లు - తోరణాలు ఏర్పాటు చేసి అభిమానాన్ని చాటుకున్నారు. విశాఖ విమానాశ్రం నుంచి శారదాపీఠం వెళ్లే రోడ్ మార్గం వరకు భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.  ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావుకు స్వాగతం.. సుస్వాగతం అంటూ సాదరంగా ఆహ్వానించే తోరణాన్ని ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో వీటిని ఏర్పాటు చేయడంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు ప్రత్యేకంగా ఆగి చూస్తున్నారు.


Tags:    

Similar News