ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని రాజకీయ కుటుంబాలు ఉన్నాయి కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్యామిలీ రూటే సపరేటు అని చెప్పక తప్పదు. కేసీఆర్ మాదిరే వారి మాటలు.. చేతలు అన్ని వ్యూహాత్మకంగా ఉంటాయి. తొందరపాటుతో తప్పులు చేయటం.. అనవసరంగా మాటలు జారటం లాంటివి కనిపించవు.
తమను ఎవరైనా విమర్శిస్తే.. బండకేసినట్లుగా ఉతికిపారేసి.. మళ్లీ నోరు తెరవకుండా మాట్లాడటం కేసీఆర్ కు ఎంత బాగా వచ్చో అదే తీరులో (కేసీఆర్ స్థాయిలో కాకున్నా) అందరూ ఆమోదించేలా మాట్లాడటంలో కేసీఆర్ కుమారుడు కమ్ మంత్రి కేటీఆర్ కానీ.. కుమార్తె కమ్ ఎంపీ కవిత కానీ ఎప్పుడూ తప్పులు చేసింది లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర సర్కారు తీరుపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తప్పులు ఎత్తి చూపటమే కాదు.. చేతకాకుంటే అధికారాన్ని వదిలిపెట్టాలన్న పెద్ద మాటను అనేశారు.
ఎవరూ అనని అంత మాటను కోదండం మాష్టారు అనటంపై గులాబీ దళం ఫీలై ఫైర్ అయ్యింది. ఒక రేంజ్లో కోదండరాం మాష్టారుపై తిట్ల వర్షాన్ని కురిపించారు. అంత తీవ్రస్థాయిలో మండిపడటం తెలంగాణవాదుల్లో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదిలా ఉంటే.. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. కోదండరాం చేసిన విమర్శలపై ఏ మాత్రం స్పందించని వారు ఎవరైనా ఉన్నారా? అంటే అది కేసీఆర్ ఫ్యామిలీనేనని చెప్పాలి.నిజానికి తన తండ్రిని అంటుంటే.. కూతురిగా.. కొడుకుగా తమదైన శైలిలో విమర్శలు చేయటం మామూలుగా కనిపిస్తుంది. కానీ.. మిగిలిన వారికి భిన్నంగా కేసీఆర్ ఫ్యామిలీ మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉండటం చూసినప్పుడు వీరి తీరే వేరులే అనిపించక మానదు. ఏ మాత్రం తొందరపాటుకు గురి కాకుండా కూల్ గా ఉన్నట్లుగా ఉంటూ వ్యూహాత్మకంగా వ్యవహరించటం కేసీఆర్ ఫ్యామిలీకే చెల్లుతుందేమో..?