గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ తనతో సన్నిహితంగా మెలిగే కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు - బండారు దత్తత్రేయలపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులుగా ఈ ఇద్దరు మంత్రులను పేర్కొంటూ విరుచుకుపడ్డారు.
కేంద్రం ఇచ్చే నిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు్ కడుతున్నారని కేంద్ర మంత్రి దత్తాత్రేయ అనడంపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దేశంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందే తెలంగాణ రాష్ట్రంలో అని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా ఈ పథకం లేదని, ఆఖరికి చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్న ఏపీలో కూడా లేదనే విషయాన్ని గమనించాలన్నారు. తను ఇన్నాళ్లు పెద్ద మనిషి అని గౌరవించినప్పటికీ దత్తాత్రేయ కామెంట్లు వాస్తవదూరంలో ఉండటంతో స్పందించాల్సి వచ్చిందన్నారు.
మరోవైపు రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే పోలవరం ముంపు మండలాలు ఏపీలో కలిపేందుకు వెంకయ్య నాయుడు సహకరించి రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ఆరోపించారు. పనిలో పనిగా జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ పూర్తి మెజారిటీతో గెలిస్తే తాను చెవు కోసుకుంటానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యలపై కేసీఆర్ మండిపడ్డారు. ఫిబ్రవరి 5 తర్వాత నారాయణ హైదరాబాద్ లో ఉండొద్దని సూచిస్తూ తమ గెలుపు ధీమాను ప్రకటించారు. ఆ తేదీ తర్వాత ఇక్కడే ఉంటే ఎవరో ఒకరు నారాయణ చెవి కోస్తారని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఉంటే ఇక్కడే ఆస్పత్రిలో చికిత్స చేయించాల్సి వస్తుందని వివరించారు.
టీడీపీ - బీజేపీలను ముఠాలతో పోలుస్తూ....గతంలో వరంగల్ ఉప ఎన్నికల సందర్భంగా అక్కడి తిరిగి టీఆర్ ఎస్ పై అవాకులు చెవాకులు పేలారని ఆరోపించారు. అయితే అక్కడ ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు కూడా రాకుండా వరంగల్ ప్రజలు వాళ్లకు బుద్ది చెప్పారన్నారు. ఇప్పుడు అదే ముఠా హైదరాబాద్ లో తిరుగుతుందని అందుకే ఎవరికి ఓటు వేయాలో ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పారు.