వరంగల్ ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. మొన్నటివరకూ ఓ మోస్తరు నేతలు ప్రచారం చేస్తే.. గత రెండు రోజులుగా అగ్రనాయకులు ప్రచార బరిలోకి దిగటం తెలిసిందే. వరంగ్ ఉప ఎన్నిక ప్రచారానికి కాంగ్రెస్ అధినాయకత్వం డిగ్గీరాజా.. మాజీ లోక్ సభా స్పీకర్ మీరాకుమార్ లాంటి వారిని దించితే..వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగారు. మంగళవారం సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వరంగల్ లోని హన్మకొండలోని అర్ట్స్ కాలేజీలో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తనపైనా.. తన ప్రభుత్వం మీదా విరుచుకుపడుతున్న పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు.
వరంగల్ నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని.. ఆ బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ ప్రజలకు మాటిచ్చారు. వరంగల్ ను టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటు చేస్తానని చెప్పిన యన.. ఏడాదిలోనే తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్తు సమస్యను అధిగమించామన్న విషయాన్ని గుర్తు చేశారు. 2018 నాటికి రాష్ట్రంలో 24 విద్యుత్తు అందిస్తామని చెప్పిన ఆయన.. వచ్చే మార్చి తర్వాత రైతులకు పగటిపూటే విద్యుత్తు అందజేయటం పక్కా అని చెప్పారు.
58 ఏళ్లలో జరిగిన అన్యాయాలను.. తెలంగాణ కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీ నాయకుల కారణంగా అంటిన దరిద్రాన్ని పోగొట్టేందుకు తమ సర్కారు తీవ్రంగా కృషి చేస్తుందన్న కేసీఆర్.. కేవలం 16 నెలల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించామన్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేయాలంటే చాలామంది వెనుకాడారని.. కానీ తాము మాత్రం అలా ఎప్పుడూ చేయలేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం విపక్షాలు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని.. ఆ విషయాన్ని ప్రజలు గుర్తించి ఓట్లు వేయాలని కోరారు. తాను చెప్పేది తప్పు అయితే.. ఏ శిక్షకైనా సిద్ధమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పని చేయటం లేదని ఆరోపణలు చేస్తున్న తెలంగాణ విపక్షాలు.. ఏం చేస్తే ప్రజలకు మేలు జరుగుతుందన్న విషయాన్ని మాత్రం చెప్పటం లేదన్నారు. ఓట్ల రూపంలో ప్రజలు విపక్షాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ.. బీహార్ ఎన్నికల్లో దెబ్బలు తిన్నా బీజేపీకి బుద్ధి రాలేదని కేసీఆర్ మండిపడ్డారు. ఢిల్లీలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం గడిచిన 16 నెలల్లో ఒక్క మంచిపని అయినా చేసిందా? అని బీజేపీ నేత కిషన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన కేసీఆర్.. కేంద్రంలో బీజేపీ సర్కారు చేసిన ఒక్కటంటే ఒక్క మంచి పని గురించి కిషన్ రెడ్డి చెబితే తాను ఆయనకు జై కొడతానని వ్యాఖ్యానించారు. పదహారు నెలల్లో రెండు రాష్ట్రాల్లోని ప్రజలు బీజేపీని భయంకరంగా తిరస్కరించారని.. అలాంటి పార్టీ తమను విమర్శిస్తుందా? అంటూ ప్రశ్నించారు.
ఉప ఎన్నికల్లో తనకు షాకివ్వాలంటూ ప్రచారం చేస్తున్న బీజేపీపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడుతూ.. తమ ప్రభుత్వం చేపట్టిన పలు పథకాల్ని ప్రస్తావించిన కేసీఆర్.. ఆ పథకాల్ని అమలు చేస్తున్నందుకు ప్రజలు షాకివ్వాలా అంటూ ఎద్దేవా చేశారు. ఎవరికి షాక్ ఇవ్వాలో ప్రజలకు బాగా తెలుసని.. ఢిల్లీ.. బీహార్ లలో ప్రజలు బీజేపీకి బాగానే షాకిచ్చారన్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో ఇచ్చిన షాకులతో కోలుకోలేక.. ఇక్కడకు వచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నరంటూ తీవ్రస్థాయిలో మండి పడ్డారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే విపక్ష నేతలు ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన.. వాస్తవాలను వక్రీకరించే పార్టీలకు ప్రజాస్వామ్య రీతిలో బుద్ధి చెప్పాలన్నారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా ఓట్లు అడగనని చెప్పిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలో ఎవరూ లేరన్న కేసీఆర్.. రెండున్నరేళ్లలో వాటర్ గ్రిడ్ పథకాన్ని పూర్తి చేసి తెలంగాణ ఆడపడుచుల పాదాలు కడుగుతామని పునరుద్ఘాటించారు. అడ్డం.. పొడువు మాట్లాడే పార్టీలకు శిక్ష వేయాలన్న ఆయన.. తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.