కేసీఆర్ నోటి వెంట వ‌చ్చిన తిట్ల లెక్క చూశారా?

Update: 2017-08-03 04:34 GMT
రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు.. ఆరోప‌ణ‌లు మామూలే. కానీ.. బండ‌కేసి బాదిన‌ట్లుగా తిట్టిపోయ‌టం కొద్దిమంది అధినేత‌ల‌కు మాత్ర‌మే చేత‌న‌వుతుంది. విలువ‌ల గురించి ఓప‌క్క మాట్లాడుతూనే.. మ‌రోప‌క్క త‌న మీద విమ‌ర్శ‌లు చేస్తున్న వారిపైన.. నా కొడుకులు అంటూ తీవ్ర‌స్థాయిలో ఒక‌టికి ప‌దిసార్లు విరుచుకుప‌డ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుందేమో?

ప‌లు అంశాల మీద త‌న‌ను త‌ప్పు ప‌డుతున్న విప‌క్షాల‌పై కేసీఆర్ చేస్తున్న విమ‌ర్శ‌ల్ని చూసిన‌ప్పుడు షాక్ తిన‌క మాన‌దు. తిట్టొచ్చు కానీ.. స‌రికొత్త యాంగిల్స్ లో.. రెండు గంట‌ల పాటు తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్ట‌టం కేసీఆర్‌కు మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుందేమో?

వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా తిట్ల పురాణం లంకించుకున్న కేసీఆర్ తాజా తిట్లు కాంగ్రెస్ నేత‌ల చెవుల్లో నుంచి ర‌క్తాలు కార‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక విప‌క్ష పార్టీ మీద ఇన్నేసి గంట‌లు.. ఇంత భారీగా తిట్లు తిట్ట‌టం మ‌రే రాష్ట్రంలోని.. మ‌రే రాష్ట్ర ముఖ్య‌మంత్రి చేయ‌లేరేమో? అంతేనా.. వామ‌ప‌క్ష పార్టీల మీద కూడా ఇంత తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డిన సీఎంగా కూడా కేసీఆర్ ను మాత్ర‌మే చూడాలేమో. నా కొడుకులు అంటూ.. నాన్ స్టాప్ గా తిట్టేసిన కేసీఆర్ మాట‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.

కేసీఆర్ తిట్ల లెక్క‌ను చూస్తే..

= జైరాం ర‌మేశ్ ఆరోప‌ణ‌లు ఊహాజ‌నితం. సెన్స్ లెస్‌. బేస్ లెస్‌. థ‌ర్డ్ రేటెడ్‌. ఈడియాటిక్ ఆరోప‌ణ‌లు. ఒక డాక్యుమెంట్ కూడా పెట్ట‌లేదు. ఆధారం చూప‌లేని స‌న్నాసి రాజ‌కీయాలు. ప‌రువున‌ష్టం కేసు వేస్తాం. శృతిమించితే త‌ప్పుదు. ఏనాడైనా స‌ర్పంచిగానైనా గెలిచాడా?

= అపాయింట్ మెంట్ ఇవ్వ‌లేదంటారు. మూర్ఖంగా మాట్లాడే వాళ్ల‌కు ఎలా ఇచ్చేది? వాళ్ల‌కు వాళ్లే నిర్ణ‌యానికి వ‌చ్చేసి  ధ‌ర్నాలు చేసి.. అడ్డం పొడుగు మాట్లాడితే నేను అపాయింట్ మెంట్ ఇవ్వాలా? నా జీవితంలో అత్యంత కీల‌క‌మైన 15 ఏళ్లు క‌ష్ట‌ప‌డ్డా.  ప‌దవుల్ని కాలి చెప్పుల్లా తీసి అవ‌త‌ల పారేశా. అప్పుడు ఈ కూత‌లు కూసే నా కొడుకులు ఎక్క‌డున్న‌రు? వీళ్లెవ‌రండీ? నా కొడుకులు. పోచంపాడుకు నేను కూడా వెళ్తున్నా. అక్క‌డే తేలుస్తా. వామ‌పోఆల‌ను నిల‌దీయ‌టం కాదు. ఎండ‌గ‌డ‌తా.

=  ప‌దేళ్ల పాల‌న‌లో ఇసుక మీద రూ.50 కోట్లు కూడా తేన‌టువంటి పార్టీ అది. మూడేళ్ల‌లో రూ.1000 కోట్లు సంపాదించిన పార్టీని నిందిస్తే.. సిగ్గా ఎగ్గా.. అది నోరా? అవి నాలుక‌లా? తాటి మ‌ట్ట‌లా? మాట్లాడ‌టానికి సిగ్గుండాలి. పిచ్చి కేసులు వేయ‌టం.. పిచ్చి మాట‌లు మాట్లాడ‌టం అన్ని మౌనంగా చూస్తున్నా. ముఖ్య‌మంత్రిని ప్ర‌తి విష‌యానికి స్పందించ‌టం బాగోదు. సంబంధిత మంత్రులు ఉన్న‌రు స‌మాధాన‌మిస్త‌ర‌ని చూస్తున్న‌. కానీ.. దీనికో అంతు.. అదుపు.. అడ్డు లేదు. ఇష్ట‌మొచ్చిన‌ట్లుగా సొల్లు పురాణాలు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఆరోప‌ణ‌లు. ఒక‌టే సొల్లు పురాణాలు త‌ప్ప ఒక్క పాయింటు చూపించినారాండి.

= న‌కిలీ విత్త‌నాలు వ‌స్తుంటే టాస్క్ ఫోర్స్ బృందాల్ని పంపించినం. వారు త‌వ్వుతూ పోతా ఉంటే.. న‌కిలీ విత్త‌నాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. కారం క‌ల్తీ చేసే నాకొడుకులు.. పాల‌ను క‌ల్తీ చేసే నా కొడుకు బ‌య‌ట‌ప‌డ్డారు. ఇంకా త‌వ్వితే డ్ర‌గ్స్ నా కొడుకులు కూడా బ‌య‌ట‌ప‌డ్డ‌రు. గుడుంబాను అరిక‌ట్టినం. పేకాట‌ను అరిక‌ట్టినం. ఈ డ్ర‌గ్స్ కూడా వ‌స్తున్న‌యి. వాటిని అరిక‌ట్టాల‌ని చెప్పిన్రు. తెలంగాణ‌లో పేకాట‌.. గ్యాంబ్లింగ్ లేదు. ఆన్ లైన్ లో పెడితే దానిని కూడా కొట్టి అవ‌త‌ల పారేసినం. కోర్టు కూడా మాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆన్ లైన్ లేదు.. ఆఫ్ లైన్ లేదు నా కొడ‌కా చ‌ల్ గెటౌట్ అన్నం.
Tags:    

Similar News