కేసీఆర్ సైలెన్స్.. దీనిపైనే గురి అట..

Update: 2019-01-29 09:56 GMT
తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కేసీఆర్‌ ప్రస్తుతం ఏం చేస్తున్నారనే ప్రశ్న అందరిలో మొదలైంది. అక్టోబర్‌ 6 నుంచి డిసెంబర్‌ వరకు సీట్ల కేటాయింపు నుంచి ప్రచారంలో వేడిని పెంచారు. ఆ తరువాత టీఆర్‌ ఎస్‌ 80 స్థానాల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో ప్రస్తుతం రెస్ట్‌ తీసుకుంటున్నారు. అయితే ఈనెల 2న ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలకే కేసీఆర్‌ కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పినట్లు సమాచారం. ఇప్పటికే టీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా కేటీఆర్‌ ను నియామకం చేసి కేసీఆర్ కాస్త బరువును దించుకున్నారు.  

అయితే కేసీఆర్‌ త్వరలో జరిగే లోక్‌ సభ ఎన్నికల వైపు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికల్లో 100 సీట్లలో విజయం సాధిస్తామని అనుకున్నారు. అయితే 80 స్థానాల్లో టీఆర్‌ ఎస్‌ అభ్యర్థులు గెలిచారు. అయితే వచ్చే లోక్‌ సభ ఎన్నికల్లో మాత్రం అనుకున్న స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారి చేసినట్లు  సమాచారం.

గత ఎన్నికల్లో హైదరాబాద్‌, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో టీఆర్‌ ఎస్‌ కొన్ని స్థానాలను కోల్పోయింది. ప్రస్తుతం కాంగ్రెస్‌, టీడీపీ పొత్తు లేనందున ఖమ్మం టీఆర్‌ ఎస్‌ పాగా వేయడానికి మార్గం సుగమం అయింది. దీంతో పార్లమెంట్‌ ఎన్నికల్లోనైనా తమ పట్టును నిలుపుకోవాలని టీఆర్‌ ఎస్‌ ఆలోచిస్తోంది. దీంతో ఈ స్థానాల్లో కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిని సారించనున్నట్లు తెలుస్తోంది.



Tags:    

Similar News