తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు అధికారులను గందరగోళంలో పడేస్తున్నాయా? సందర్భానుసారం గులాబీ దళపతి చేసే ప్రకటనలు ఆ పార్టీ నేతల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నప్పటికీ...అధికారులను మాత్రం పరుగులు పెట్టిస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇదంతా పంచాయతీ ఎన్నికల గురించి. స్థానిక సంస్థల ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయని గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని కూడా వినిపిస్తోంది.దీంతో అధికారుల్లో అస్పష్టత నెలకొంది. అదే సమయంలో దాదాపు పదివేల మందికి పైగా ప్రజాప్రతినిధులు ఉత్కంఠగా సర్కారు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నెలల్లోనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సూచించినట్లుగా వీలుగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నా..ఎప్పుడైనా వాయిదా పడవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అన్ని రాష్ట్రాల్లో గడువులోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి కావాలి. ఈ ఏడాది ఆగస్టు ఒకటిన పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరాలి. ప్రస్తుత పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మూడు నెలల్లోపు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చని ఒక వాదన ఉన్నా ఆరు నెలలలోపు నిర్వహించవచ్చని మరో వాదన కూడా వినిపిస్తోంది. మొదటి వాదన ప్రకారం చూస్తే మే - జూన్ - జూలై నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలను నిర్వహించుకోవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకునే ఎన్నికల సంఘం రాష్ట్రప్రభుత్వానికి తాత్కాలిక షెడ్యూల్ ను పంపింది. పలు సూచనలు కూడా చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం మార్చి 18లోగా పంచాయతీ ఓటర్ల తుది జాబితా సిద్ధం కావాలి. ఏప్రిల్ 16న రిజర్వేషన్లను ఖరారు చేయాలి. ఏప్రిల్ 17న పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై నిర్ణయం జరగాలి.
జూన్ రెండవ వారంలో రాష్ట్రంలో విద్యాసంవత్సరం మొదలవుతుంది కాబట్టి మే చివరికల్లా ఎన్నికలు నిర్వహించాలని అధికారులు అభిప్రాయపడుతున్న ఈ నేపథ్యంలో ఇటు అధికారులు అటు స్థానిక సంస్థల ప్రతినిధులు గులాబీదళపతి లీకుల గురించి కాకుండా....అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ముందస్తు మాటేమో కానీ నిర్ణీత సమయంలో నైనా జరుగుతాయా అనే అనుమానాలు అటు అధికారుల్లో - ఇటు ప్రజా ప్రతినిధుల్లో వ్యక్తమవుతున్నాయి. దాదాపు 10వేలమందికి పైగా సర్కారు ప్రకటన కోసం ఎదురుచూస్తుండటం గమనార్హం.