తమిళ హీరో సూర్య తెలుసుగా ఆయన నటించిన ఆరు సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్టు కొట్టింది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కూడా ఈ ఆరు ఓ సెంటిమెంటుగా మారిపోయింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్న కల్వకుంట్లవారు తనకు కలసివచ్చే ఆరు సంఖ్యను ఎంచుకున్నట్లు ఓ వార్త చక్కెర్లు కొడుతోంది. అయితే ఇదీ ఏ ఆరో మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కు జాతక ప్రకారం ఆరు సంఖ్య కలసి వస్తుందని పండితులు చెప్పారు. అయితే అది సింగిల్ ఆరా లేక కొన్ని నంబర్లు కలపిన తర్వాత వచ్చే ఆరా అన్నది తెలడం లేదు. దీనిపైనే అటు పార్టీలోనూ - ఇటు ప్రభుత్వంలోనూ - ముఖ్యంగా ప్రజలలోను చర్చనీయంశంమైంది. ఆరు నంబరు కలసివస్తుంది కాబట్టి ఈ నెల ఆరో తేదిన తన రాజకీయ నిర్ణయంమైన శాసన సభ రద్దును ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ నెల నాలుగో తేది అన్నీ సంఖ్యలు కలిపితే ఆరు నెంబరు వస్తుంది. అంటే 04-09-2018. ఈ నెంబర్లను కూడితే వచ్చే సంఖ‌్య కూడా ఆరే కావడం గమనార్హం. దీని ప్రకారం మంగళవారం నాడే తన రాజకీయ నిర్ణయాన్ని కె. చంద్రశేఖర రావు ప్రకటిస్తారా అని కొన్ని వర్గాలు అంటున్నాయి.
సెప్టెంబరు నెలలోనే తెలంగాణ శాసన సభను రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణలో ముందస్తు వేడి రాజుకుంటోంది. కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రతిపక్షాలు కూడా ముందస్తుకు సిద్దమవుతున్నాయి. ఈ పరిస్థితులలో అంకేల గారాడి ప్రారంభమయింది. సెప్టెంబర్ 4వ తేదీన అంటే మంగళవారం నాడే సభను రద్దు చేస్తారా లేదా అనేది తెలాల్సి ఉంది. ఒక వేళ గవర్నర్ ను కలసి శాసన సభ రద్దు నిర్ణయాన్ని తెలియజేస్తే రెండు రోజుల తర్వాత అంటే ఆరో తేదీన శాసనసభ రద్దు ప్రకటన చేస్తారా అన్నది తేలాలి. ఏదిఏమైనా ఈ నెలలోనే తెలంగాణ శాసనసభ రద్దు కావడం ముందస్తుకు మూహూర్తానికి నిర్ణయం జరగడం మాత్రం ఖాయం.ప్రస్తుతం తెలంగాణ రాజకీయం ఆరు అంకే చుట్టూ తిరుగుతోంది.