కరోనా కేసులు తగ్గలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబడలేదు. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకున్నారు. మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం భారీగా పడిపోవటంతో.. మార్చి.. ఏప్రిల్.. మే నెలల్లో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు కోత విధించిన వైనం తెలిసిందే. ఈ విషయంపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. అయినప్పటికీ.. పూర్తి జీతాలు ఇచ్చేందుకు ససేమిరా అన్న సీఎం కేసీఆర్.. తాజాగా మాత్రం కోత జీతాల్ని ఇచ్చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు.
ప్రభుత్వం కోత పెట్టిన జీతాల్ని మూడు వాయిదాల్లో తిరిగి చెల్లించేందుకు ఓకే చెబుతూ ఉత్తర్వుల మీద సంతకం పెట్టారు సీఎం కేసీఆర్. ఉద్యోగులకు ఈ నెల.. వచ్చే నెల నవంబరుతో పాటు.. డిసెంబరు మూడు నెలల్లో మూడు వాయిదాల్లో కోత జీతాన్ని తిరిగి ఇవ్వాలని చెప్పేశారు. ఎందుకిలా? ఇప్పటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడలేదు.. ఆ మాటకు వస్తే.. లాక్ డౌన్ ముందు వచ్చిన ఆదాయం కూడా ప్రభుత్వానికి రావటం లేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు.
త్వరలో గ్రేటర్ ఎన్నికలు జరగనుండటం.. పలుకార్పొరేషన్లకు ఎన్నికలతో పాటు.. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేస్తున్న వేళ.. అన్ని వర్గాల మనసుల్ని దోచేందుకు వీలుగా కోత జీతాన్ని తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఫించన్ దారులకు సైతం కోత పెట్టారు. ఈ మొత్తాన్ని కూడా తిరిగి ఇచ్చేసేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ అంచనా వేసినట్లే.. కోత జీతాన్ని తిరిగి ఇచ్చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయానికి ఉద్యోగ సంఘాలు సంతోషాన్ని వ్యక్తం చేయటమే కాదు.. ముఖ్యమంత్రిని తెగ పొగిడేస్తున్నారు. మొత్తానికి కోత వాతకు.. తిరిగి చెల్లింపుల ద్వారా ఆయిట్ మెంట్ రాసిన వైనం కేసీఆర్ ముందుచూపునకు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు.