అందరూ పత్తిత్తులే అన్నట్లుగా ఉంటుంది రాజకీయ నాయకుల్ని చూస్తే. చెప్పేందుకు మాత్రం నీతి మాటలు వందలకొద్దీ చెబుతారు కానీ ఏ ఒక్క దాన్ని..తమ మాటలకు తగ్గట్లు చెప్పరని చెబుతుంటారు. ఈ మాటల్లో నిజం ఎంతన్న విషయాన్ని ఇటీవల పార్టీ నుంచి వేటు వేయించుకొని మరీ బయటకు వచ్చిన మాజీ బీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయనసంచలన విషయాల్ని వెల్లడించారు.
మొన్నీ మధ్య జరిగిన ఉప ఎన్నికల వేళలో.. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనకు మోడీ సర్కారు నుంచి పనులు లభించినట్లుగా చెప్పటం.. దీని పై పెద్ద రచ్చే జరగటం తెలిసిందే. ఆ సందర్భంలో మాట్లాడిన గులాబీ ముఖ్యనేతలంతా కేంద్రంలోని మోడీ సర్కారు పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం.. కోమటిరెడ్డి బ్రదర్ మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే.. కోమటిరెడ్డికి కేంద్రంలోని ఎన్డీయే సర్కారు పనులు ఇచ్చినట్లుగా రాష్ట్రంలోని పనులను తమకు ఇచ్చిన విషయాన్ని తాజాగా పొంగులేటి రివీల్ చేశారు.
బంగారు తెలంగాణ అన్న మాటలకు తాను పడిపోయి.. కేసీఆర్ ట్రాప్ లో చిక్కుకున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ సర్కారుతనకు రూ.2900కోట్ల పనులను అప్పగించినట్లు చెప్పారు. అయితే తనకు ఇచ్చిన పనుల లెక్కను తర్వాత చెబుతానని. తనకు పనుల్ని ఎందుకు ఇచ్చారన్నది సమయం వచ్చిన తర్వాత చెబుతానని చెప్పారు. ఇదే సమయంలో ఆయన మరో సంచలన నిజాన్ని చెప్పేవారు.
మిగిలిన కాంట్రాక్టర్ల మాదిరే తాను కేసీఆర్ కు పర్సంటేజీ ఇచ్చానని పేర్కొన్నారు. తాను చెప్పిన మాటలన్నింటిని నిరూపిస్తానని.. సాక్ష్యాలతో సహా ఉన్నట్లు చెప్పారు. 'ఎనిమిదేళ్లలో ఇరిగేషన్ లోనే రూ.1.8లక్షల కోట్ల టెండర్లు పిలిచారు. ఇతరత్రా పనులకు సంబంధించి పర్సంటేజీల రూపంలో వేలాది కోట్లు అంది ఉంటాయి. ఆ మొత్తంతోనే దేశంలోని అన్ని పార్టీలకు ఎన్నికల ఖర్చును పెడుతానని చెబుతున్నారు. నాకు ఇంకా రూ.700 కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. నేను చేయాల్సిన పనులు రూ.450 కోట్ల వరకు ఉన్నాయి' అంటూ చెప్పిన మాటలు సంచలనంగా మారాయి.