సీఎం ముద్దుల మనమడు.. కేటీఆర్ కుమారుడి గుర్రాన్ని చూశారా?

Update: 2020-10-06 13:30 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారాల మనమడు హిమాన్షు ఈ మధ్యన వార్తల్లోకి రావటం తెలిసిందే. రోటీన్ కు భిన్నమైన వార్తల్లో ఆయన కనిపిస్తున్నారు. మొన్నటికి మొన్న గుర్రపు స్వారీ చేస్తూ.. పట్టు తప్పి కింద పడిన ఉదంతంలో తొంటి ఎముకకు ఫ్యాక్చర్ అయినట్లు.. కాలికి కూడా గాయం అయినట్లుగా వార్తలు వచ్చాయి. వాటిని సోషల్ మీడియా వేదికగా చేసుకొని హిమాన్షు ఖండించారు.

వారు చెప్పినట్లుగా తనకు ఫ్యాక్చర్ కాలేదన్నారు. రేపటి నుంచి రన్నింగ్ చేస్తానంటూ అతగాడు పెట్టిన పోస్టుకు కంటిన్యూషన్ కు మళ్లీ పోస్టు పెట్టింది లేదు. ఇదిలా ఉంటే.. హిమాన్షు గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారా? అది నిజమేనా? అన్న సందేహాల్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివేళ.. ఒక న్యూస్ చానల్ ఒక అడుగు ముందుకు వేసి.. హిమాన్షు గుర్రం ఇదేనంటూ ఒక వీడియోను టెలికాస్టు చేసింది.

దీంతో.. సోషల్ మీడియాలో దొరికిన ఒక మీడియో వార్తాంశంగా మారింది. అందులో హిమాన్షు తన గుర్రాన్ని తీసుకొని నడుచుకుంటూ వెళ్లటం కనిపిస్తుంది. మొత్తంగా గుర్రపు స్వారీ నేర్చుకుంటున్నారన్న విషయంతో పాటు.. హిమాన్షు  గుర్రం కూడా తాజాగా లోకానికి పరిచయమైందని చెప్పాలి. మరి.. గుర్రంతో పాటు తాను నడుస్తున్న వీడియో బయటకు వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ కుమారుడు ఎలా రియాక్టు అవుతారో చూడాలి.Full View
Tags:    

Similar News