నిఖ‌త్ కు కేసీఆర్ సాయం ఎంతో తెలుసా ?

Update: 2022-05-20 09:32 GMT
ఎనిమిదేళ్ల క్రిత‌మే  నిఖ‌త్ (బాక్సర్) కు కేసీఆర్ యాభై ల‌క్ష‌ల రూపాయ‌లు సాయం చేశార‌న్న వార్త ఒక‌టి హ‌ల్చ‌ల్ చేస్తోంది. మ‌రోవై పు విశ్వ విజేత‌గా నిలిచిన నిఖ‌త్ జ‌రీన్ కోసం తండ్రి  జ‌మీల్ అహ్మ‌ద్ చేసిన త్యాగం కూడా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఇవాళ తెలంగాణ బీజేపీ కూడా చాలా హుందాగానే స్పందించి., 4 మంచి మాట‌లు రాసింది.

కానీ ఆమె విజ‌యం వెనుక మోడీ కృషి ఉంది అని కొంద‌రు ఫేక్ పోస్ట‌ర్లు క్రియేట్ చేసి, తెలంగాణ బీజేపీ ఆ విధంగా మాట్లాడింది అన్న అర్థం వ‌చ్చే విధంగా పోస్టులు పెడుతున్నారు. వాస్త‌వానికి ఆ మాట అయితే బీజేపీ అన‌లేదు. ఒకవేళ ఆ విధంగా వ్యాఖ్యానించి త‌ప్పు దిద్దుకున్నా స‌రే స్వాగ‌తించాల్సిందే !

వాస్త‌వానికి మంచి తండ్రి కార‌ణంగా మంచి త‌ల్లి ప్రోద్బ‌లం కార‌ణంగా ఆమె ఇవాళ ఇంత‌టి ఉన్న‌త స్థాయికి చేరుకున్నారు అన్న‌ది నిజం.  నాన్న ప్రోత్సాహం లేకుండా ఇంత‌టి స్థాయి వ‌చ్చేది కాదు. నాన్న త‌రువాతే ప్ర‌భుత్వ పెద్ద అయిన కేసీఆర్ అయినా మ‌రొక‌రు అయినా.. ! ఆమె విష‌య‌మై ! కానీ.. ఆ రోజు ఆ తండ్రి ప్రోత్సాహ‌మే లేక‌పోతే నిఖ‌త్ లేదు. అందుకే ఇప్ప‌టికీ ఎంద‌రో తండ్రులకు ఆయ‌న స్ఫూర్తి అయ్యారు.

నిఖ‌త్ ఎవ‌రు అని వెత‌క్కండి.. ఆమె ఎవ‌రు అయితే ఏంటి.. ఈ దేశం బిడ్డ అని గుర్తించ‌డం మ‌రువొద్దు. కానీ మ‌న ద‌గ్గ‌ర అన్ని ప‌ట్టింపులూ ఎక్కువ‌గా ఉంటాయి క‌నుక గూగుల్ వెతుకులాటలు విరివిగా సాగుతుంటాయి క‌నుక అవేం పెద్ద త‌ప్పులు కాక‌పోయినా ఈ  విజయాన్ని, విశ్వ విఖ్యాతి గాంచిన విజయాన్ని అంతా నెత్తిన పెట్టుకోవాలి.

అప్పుడు కొంద‌రు ఆడ బిడ్డ‌లు ఇంటి గడప దాటి బ్యూటీ పార్ల‌ర్ల‌కే కాదు మైదానం వాకిట కూడా రాణించ‌గ‌లం అని సత్తా  చాట‌డం ఇక‌పై ఓ అల‌వాటుగా చేసుకుంటారు. క‌నుక నిఖ‌త్ ఎంత గొప్ప‌వారో ఆమె తండ్రీ మ‌రియు త‌ల్లీ ఇంకా ఆమెను ఎంత‌గానో ప్రోత్స‌హించి దీవించి పంపిన అధికారులు ఇలా అంతా అంతా ఇవాళ ఈ విజ‌యంలో వాటా దారులే ! బుజ్జిత‌ల్లీ నీకు జేజేలు. నిన్ను ఇంకాస్త ప్రోత్స‌హించేందుకు సిద్ధం అవుతున్న మెంటార్ల‌కు కూడా ! జేజేలు..
Tags:    

Similar News