ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేసిన కామెంట్లు తననెంతో బాధించాయని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రపంచ తెలుగు మహాసభలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన సందర్భంగా సీఎం కేసీఆర్ స్వయంగా - బహిరంగంగా ఈ విషయాన్ని వెల్లడించారు. తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలుగు మహాసభలను సుసంపన్నం చేసినందుకు ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవంగా తెలుగు మహాసభలు నిర్వహించుకొని ప్రపంచానికి చాటిచెప్పామని తెలిపారు. ఇక నుంచి ప్రతీ ఏడాది డిసెంబర్ మొదటి వారంలో రెండు రోజుల పాటు వైభవంగా తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహించబడతాయని సీఎం ప్రకటించారు. తెలుగు మహాసభల ముగింపు వేడులకు హాజరైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు రాష్ట్ర ప్రజల తరపున సీఎం ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని సీఎం కేసీఆర్ వెల్లడించారు. `తెలుగు భాషను బతికించుకోవాలి - తెలుగు భాష మృతభాష కాకూడదని ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ఆ మాటలు నన్ను బాధించాయి. మాతృ భాషను మృత భాష అనో.. బతికించుకోవాలనో వినడం బాధాకరం. ఆ పరిస్థితి మన భాషకు సంభవించకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది.` అని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రతీ ఏటా రెండు రోజుల పాటు డిసెంబర్ నెలలో తెలంగాణ తెలుగు మహాసభలు నిర్వహించబడుతాయని పేర్కొన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు భాషను తప్పనిసరి చేయాలన్న నిబంధనను అమలు చేస్తామని ఉద్ఘాటించారు. ఈ గడ్డ మీద చదువుకోవాలంటే తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు.
తెలుగు మహాసభలను సంతోషంగా నిర్వహించుకొని గొప్పగా ముందుకు వెళ్లామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒక నాడు డిగ్రీ కళాశాల విద్యార్థిగా ఇదే ఎల్బీ స్టేడియంలో 1974లో ప్రపంచ తెలుగు మహాసభలను తిలకించానని చెప్పారు. నాడు జరిగిన తెలుగు మహాసభలు తనను ఎంతో ప్రభావితం చేశాయని గుర్తు చేసుకున్నారు. అలాగే నేడు జరుగుతున్న సభలు.. తెలంగాణ భాషా వైవిధ్యాన్ని - వైభవాన్ని - కళావైభవాన్ని సగర్వంగా ప్రపంచానికి చాటిందని - సభలు విజయవంతమైనందుకు - ఆశించిన లక్ష్యం సాధించినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి.. ప్రతీ ఒక్కరూ సభలను విజయవంతం చేసేందుకు కృషి చేశారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎదురైన సమస్యలను వచ్చే సభల్లో రానివ్వమని స్పష్టం చేశారు.