పదహారులో కేసీఆర్ జోరు

Update: 2016-12-31 17:30 GMT
రెండు దశాబ్ధాల పాటు ఉద్యమ నేతగా క్షేత్రస్థాయి జన జీవన శైలిపై విశేష అనుభవం గడించిన కేసీఆర్‌ ప్రభుత్వాధినేతగా 2016లో మంచి మార్కులే సాధించారు.  పరిపాలనా విధానాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూనే రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త నిర్ణయాలు, సరికొత్త వ్యూహాలు రచిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యమంలో కీలక భాగస్వామ్యం పంచుకున్న ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చి పరిపక్వత చెందిన పాలనాధినేతగా పేరు తెచ్చుకున్నారు. గోల్కొండ కోటలో ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించి తెలంగాణ పూర్వవైభవానికి పునాది వేశారు. అభివృద్ధి - సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే అన్ని రంగాల్లో ప్రక్షాళన చేపట్టి పురోగతికి చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేకతను, ప్రతిష్టను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పేందుకు సరికొత్త తరహాలో పరిపాలనను కొనసాగిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపట్టి 31 జిల్లాలను వివాదరహితంగా ఏర్పాటు చేసి ఘనత దక్కించుకున్నారు.

    రాజకీయంగానూ కేంద్రంతో మంచి సంబంధాలు మొదలైన సంవత్సరమిది. ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు తరువాత కేసీఆర్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. విమానాశ్రయంలో ఆయనతో ప్రత్యేకించి ముచ్చటించారు. కేసీఆర్ ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వడంతో మోడీ ఆయన్ను విశ్వాసంలోకి తీసుకున్నారు. రాష్ట్రంలోనూ రాజకీయంగా కేసీఆర్ కు ఎదురులేకుండానే ఉంది.

    - 90 లక్షల కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని గుర్తించి వారి ఆర్థికాభ్యున్నతికి సరికొత్త పథకాలను ప్రారంభించారు. అన్ని సంక్షేమ పథకాల్లో నిబంధనలను సడలించి సాధ్యమైనంత మేర ఎక్కువమంది లబ్ధిదారులకు న్యాయం జరిగేవిధంగా చేశారు.

    - ఎస్సీ - ఎస్టీ - బీసీ - మైనారిటీ వర్గాలతోపాటు సామాజికంగా గుర్తింపు లేని అనేక కులాలను, వర్గాలను చేరదీసే ప్రయత్నం మొదలుపెట్టారు.

    - అన్ని కులాలు - మతాల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వారికి వేర్వేరు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు.  దళితులు - గిరిజన వర్గాల కోసమే ప్రారంభించిన కళ్యాణలక్ష్మి పథకాన్ని తర్వాత వెనుకబడిన వర్గాలకు కూడా వర్తింపజేశారు.

- క్షేత్రస్థాయిలో ఈ పథకానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. ముస్లింలకు ప్రత్యేకంగా షాదీ ముబారఖ్‌ పేరుతో పథకాన్ని ప్రారంభించారు.
 
- వృద్ధులు - వికలాంగులు - వితంతువులకు ఇదివరకు ఉన్న పెన్షన్లను రూ.1000 నుంచి రూ.1500లకు పెంచడంతోపాటు కొత్తగా కల్లు గీత కార్మికులకు - చేనేత కార్మికులకు - ఎయిడ్స్‌ పేషంట్లకు - బీడీ కార్మికులకు - పేద వృద్ధ కళాకారులకు కూడా పెన్షన్లు అందజేస్తున్నారు.

- పరిమితి లేకుండా పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలను గుర్తించి వారికి ఆహార భద్రత కల్పించేందుకు ఆధార్‌ కార్డు లింకేజితో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి కుటుంబానికి డిజిటల్‌ రేషన్‌ కార్డులను మంజూరు చేస్తూ బయోమెట్రిక్‌ విధానం ద్వారా సరుకులను సరఫరా చేస్తున్నారు.

- ఎకనామిక్‌ సపోర్ట్‌ పథకంతో  రూ.రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పించి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నారు.

- పేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలన్న సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు 2860 కుటుంబాలను గుర్తించి 7485 ఎకరాల భూమిని పంపిణీ చేశారు.

- ఎస్సీ - ఎస్టీల కోసం ప్రత్యేకంగా 180 రెసిడెన్షియల్‌ పాఠశాలలను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

- అంబేద్కర్‌ ఓవర్సిస్‌ పథకం ద్వారా విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సైతం స్కాలర్‌ షిప్‌ లను అందజేస్తున్నారు.

- గిరిజన వర్గాల ఆర్థిక ఎదుగుదల కోసం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.

- గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మారుస్తూ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు.


- మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ వర్గాల కోసం 120 రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరు చేశారు. విద్యావ్యవస్థలో మొదటి ఆప్షన్‌గా ఉర్దూ భాషకు ప్రాధాన్యత కల్పించారు. తెలంగాణ రాష్ట్రానికి వక్ఫ్‌ బోర్డును ఏర్పాడు చేయడంతోపాటు మైనారిటీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు.

- అంగన్‌వాడీ వర్కర్ల జీతాలను దాదాపు రెట్టింపు చేశారు. డ్వాక్రా రుణాల రుణ పరిమితిని ఐదు నుంచి పది లక్షల రూపాయలకు పెంచారు.

- ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 19.84 లక్షల దీపం కనెక్షన్లు ఉండగా, కొత్తగా మరో 9.37 లక్షల మందికి మంజూరు చేశారు.

- మహిళల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ అత్యాచారాలు, అఘాయిత్యాలు నివారించేందుకు మహిళా పోలీసులతో షీ టీమ్‌లను ఏర్పాటు చేశారు.

-  సంక్షేమ హాస్టళ్లన్నింటికీ సన్నబియ్యాన్ని సరఫరా చేసి పేద విద్యార్థుల మన్ననలు పొందారు.

-  నాయీ బ్రాహ్మణుల సంక్షేమంలో భాగంగా క్షౌరశాలలకు ఉచిత విద్యుత్‌ను అందజేయాలని నిర్ణయించారు.

- రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా లక్ష రూపాయల్లోపు పంట రుణాలను మాఫీ చేయడంతోపాటు దురదృష్టవశాత్తూ ఆత్మహత్యలు చేసుకునే రైతు కుటుంబాలకు చెల్లించే నష్ట పరిహారాన్ని లక్షన్నర నుంచి ఆరు లక్షలకు పెంచారు.

- వ్యవసాయోత్పత్తుల నిల్వ కోసం కొత్తగా రాష్ట్రంలో 330 గోదాములను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు..

- రాజధాని నగరంలో అమలు చేస్తున్న ఐదు రూపాయల భోజన పథకాన్ని వ్యవసాయ మార్కెట్లలో ప్రవేశపెట్టి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

- వివిధ రంగాల్లో పని చేస్తున్న డ్రైవర్లు - హోంగార్డులు - జర్నలిస్టులకు రూ.5లక్షల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికులకు ఉన్న ప్రమాద బీమా పథకాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు.

- క్రీడాకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఒలంపిక్స్‌లో స్వర్ణపతకం సాధిస్తే రూ.2 కోట్లు, రజతానికి రూ.కోటి, కాంస్యానికి రూ.50 లక్షలు, ప్రాతినిధ్యం వహించినందుకు రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు.

- ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే విజేతలకు రూ.25 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందించే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

- గరుడ

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News