కేసీఆర్ ను వార్తల్లో నిలిపి ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఏంటంటే..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ పది రోజుల కిందట రెండు సంచలన పరిణామాలతో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కరోనా కల్లోలం కొనసాగుతున్న సమయంలో స్వయంగా కేసీఆర్ హైదరాబాద్ లో గాంధీ ఆస్పత్రిని, అనంతరం వరంగల్ లో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించారు. కోవిడ్ పేషంట్లు ఉన్న ఐసీయూ వార్డులోకి వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ రోగులను పరామర్శించారు. కోవిడ్ పేషంట్లకు అందుతున్న చికిత్స గురించి తెలుసుకొని కరోనాకు భయపడవద్దంటూ వారికి ధైర్యం చెప్పారు. ఈ ఎపిసోడ్ పలువురి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇప్పుడు అదే ఆస్పత్రుల కారణంగా కేసీఆర్ వార్తల్లోకి ఎక్కారు.
ఇటు హైదరాబాద్ గాంధీ, అటు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రులను సందర్శించిన సీఎం కేసీఆర్ ఆయా ఆస్పత్రులు అంతా కలియతిరిగి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న వైద్య సౌకర్యాలు, రోగులకు అందుతున్న వైద్య సేవలపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. అయితే, ఇప్పుడు ఈ ఆస్పత్రులకు చెందిన వైద్యులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన చేపడుతున్నారు.
ఇప్పటికే గాంధీలో జూనియర్ వైద్యులు ఆందోళన చేస్తుండగా తాజాగా వరంగల్ ఎంజీఎం లో జూనియర్ డాక్టర్లు ధర్నా చేపట్టారు. ఎంజీఎం ఆస్పత్రిలో విధులు బహిష్కరించి అక్కడే ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ టూర్ కారణంగా వార్తల్లోకి ఎక్కిన ఈ రెండు ఆస్పత్రులు ఇప్పుడు ఆయన నిర్ణయం తీసుకోవడం కారణంగానే మళ్లీ మీడియాలో హైలెట్ అవుతున్నాయి.