ఎవరి మాట వినని మొనగాడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరు. సూటి ప్రశ్నలతో చికాకు పుట్టించే మీడియా ప్రతినిధులను సైతం తన వాడి వేడి మాటలతో.. ఎటకారపు పంచ్ లతో ప్రశ్న వేయాలంటేనే ఒకటికి పది మార్లు ఆలోచించుకునేలా చేయటంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పాలి.
ఎవరేం అనుకుంటే నాకేంటి? నాకు నచ్చిందే చేస్తానన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాల్సి వచ్చింది. ఇటీవల కాలంలో మీడియా పుణ్యమా అని.. తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోకవటమే కాదు.. మార్చుకోవటం కూడా ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు. తాజాగా జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారానికి ప్రతి పార్టీ తన స్టార్ క్యాంపైనర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఇదే తీరులో తాజాగా టీఆర్ ఎస్ సైతం తన స్టార్ క్యాంపైనర్లను ప్రకటించింది.
ఈ లిస్ట్ చేసినోళ్లందరికి షాక్ తగిలిన పరిస్థితి. టీఆర్ ఎస్ అన్నంతనే కేసీఆర్ ఎలా గుర్తుకు వస్తారో.. హరీశ్ సైతం అంతేలా గుర్తుకు వస్తారు. అలాంటి హరీశ్ పేరు లేకుండా విడుదలైన జాబితా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చను రేపటమేకాదు.. మీడియాలోనూ ఇదే విషయం హైలెట్ అయ్యింది.
ఇప్పటికే మంత్రి పదవి లేకుండా చేయటమే కాదు.. పార్టీలోనూ కీలక స్థానం ఇవ్వకుండా.. నామ మాత్రంగా మారుస్తున్న వైనం.. అంతకంతకూ ప్రాధాన్యత తగ్గిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.దీన్ని మరింత పెంచేలా స్టార్ట్ స్టేటస్ ఇవ్వని తీరు మీడియాలో హైలెట్ అయ్యింది. పలు మీడియా సంస్థలు నేరుగా తమ హెడ్డింగ్ లో.. హరీశ్ కు స్టార్ స్టేటస్ దక్కని తీరును ప్రముఖంగా ప్రచురించింది.
గులాబీ పార్టీ ట్రబుల్ షూటర్ గా.. మేనమామ కోరిన పనిని బాధ్యతతో.. పాజిటివ్ రిజల్ట్ వచ్చేలా పూర్తి చేయటంలో మంచి పేరున్న హరీశ్ లాంటి నేతను అదే పనిగా టార్గెట్ చేస్తున్నారన్న వాదన అంతకంతకూ పెరుగుతోంది. హరీశ్ ను ఎంతలా అవమానిస్తున్నా.. అవేమీ పట్టక.. తన పని తాను చేసుకుంటూ పోవటం.. అధినేతకు అవసరమైనప్పుడల్లా నేనున్నా అంటూ ముందుకు వచ్చే తీరు ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది.
అలాంటి హరీశ్ ను స్టార్ క్యాంపైనర్ గా పక్కన పెట్టటం.. నిన్న గాక మొన్నన ఎంపీగా రాజ్యసభకు పంపిన సంతోష్ కుమార్ ను సైతం స్టార్ క్యాంపైనర్ గా నియమించటంపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ రియాక్ట్ కావటమే కాదు.. స్టార్ క్యాంపైనర్ గా హరీశ్ ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాను అనుకున్నదే తప్పించి.. వేరే వారు చెప్పింది చేయటానికి తాను లేనన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్.. అందుకు భిన్నంగా హరీశ్ ఎపిసోడ్ లో మాత్రం వెనక్కి తగ్గారని చెప్పక తప్పదు. ఫర్లేదు కేసీఆర్ సైతం.. వెనకడుగు వేస్తారన్న మాట.