ఒకప్పుడు దొరలకు ఖర్ఖానా.. వందల ఎకరాలు దోచుకున్న దొరలు, జమీందర్లు, భూస్వాముల రాజ్యమైన తెలంగాణలో ఇప్పుడు అసలు భూస్వాములే లేరని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు. మొత్తం 10 ఎకరాల్లోపు రైతులే తెలంగాణ మొత్తం మీద 98.38శాతంగా ఉన్నారని కేసీఆర్ తెలిపారు. 25 ఎకరాల పైబడిన రైతులు 6679మంది మాత్రమే ఉన్నారని.. వీరి చేతుల్లో 2,24,733 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు ఎవరూ లేరన్నారు.
తెలంగాణలో 95 శాతం భూములు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల వద్దే ఉన్నాయంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. అయితే భూస్వాములు లేకున్నా చాలా మంది బినామీ పేర్ల మీద కూడా భూములు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఇలా సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో ఇలా బ్లాక్ మనీని భూములపై పెట్టి తమ సన్నిహితులు, పనివాళ్లు, నమ్మకస్తుల మీద కొనిపెట్టారు. 100 ఎకరాలను ఫాం హౌస్ లుగా మలుచుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ వారి లెక్కలను కేసీఆర్ చెప్పకపోవడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు కేసీఆర్ భూస్వాములు లేరన్న వ్యాఖ్యలపై నెటిజన్లు కౌంటర్లు ఇస్తున్నారు.
సోమవారం శాసన మండలిలో కొత్త రెవెన్యూ యాక్ట్‌పై చర్చకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పారు. తెలంగాణలో ఆరు వేల మంది భూస్వాముల చేతుల్లో ఉన్న భూములు.. ఇప్పుడు 60.95 లక్షల మంది రైతుల ఆధీనంలోకి వచ్చాయన్నారు. కేవలం ఐదు కులాల వారి వద్దే 95 శాతం భూములున్నాయని చెప్పుకొచ్చారు. బడా భూస్వాములు, జాగీర్దార్లు, జమీందార్లు ఉన్నప్పుడు.. కౌలుదారుల రక్షణ కోసం రికార్డుల్లో అనుభవదారు కాలమ్ పెట్టారన్నారు. ‘ఇప్పుడు బంగ్లాస్వామి.. కారుస్వామి.. భూస్వామి.. అంటూ ఎవరూ లేరు. గుంట భూమి ఉన్నోళ్లు కూడా భూస్వాములే.. వాళ్లు కాక ఇంకా చాలామంది స్వాములు ఉన్నరు. వాళ్ల కథ ఏందో మనకు తెలుసు. అనుభవదారు కాలమ్ తో కొందరు గద్దల్లా భూములు తన్నుకు పోతున్నరు. ఇష్టమొచ్చినట్టు ఇంజెక్షన్ ఆర్డర్లు తెస్తే చిన్న రైతులు ఎటు పోవాలే.. భూమి ఉన్నందుకే వాళ్లు శాపగ్రస్తులు కావాల్నా, ఏ ప్రాపర్టీకి లేని అనుభవదారులు.. భూ ప్రాపర్టీకే ఎందుకు’’ అని పేర్కొన్నారు.
రాష్ట్రం వచ్చాక భూముల రేట్లు అద్భుతంగా పెరిగాయని, ఎక్కడో రిమోట్ ఏరియాలో తప్ప ఎకరం రూ.10 లక్షలకు కూడా దొరకట్లేదని కేసీఆర్ అన్నారు. భూముల రేట్లు పెరగడంతో లాండ్ మాఫియా కూడా పెరిగిందన్నారు.మోడీ సర్కారు తెలంగాణలోని కొన్ని మండలాలు లాక్కొని ఆంధ్రాకి ఇచ్చేసిందని.. సీలేరు కూడా ఇచ్చేసి తెలంగాణకు శాశ్వత నష్టాన్ని చేసిందన్నారు.
రాష్ర్టంలో మొత్తం 60,95,134 మంది పట్టాదారులు ఉండగా.. 2.5 ఎకరాల భూమి ఉన్న రైతులు 39,52,232 మంది ఉన్నారని తెలిపారు. 2.5 నుంచి 3 ఎకరాల్లోపు ఉన్న రైతులు 4,70,759 మంది, 3 నుంచి 5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 11,08,193 మంది, 5 నుంచి 7.5 ఎకరాల్లోపు ఉన్న రైతులు 3,49,382 మంది, 7.5 నుంచి 10 ఎకరాల్లోపు ఉన్న రైతులు 1,15,916 మంది, 25 వేల ఎకరాల్లోపు ఉన్న రైతులు 6 వేల మంది ఉన్నారని సీఎం తెలిపారు.
రాష్ట్రంలోని రిజిస్ట్రేషన్స్ కార్యాలయాల్లో ఇక అవినీతికి ఆస్కారమే ఉండదన్నారు. ఒక్క రూపాయి లంచం ఇచ్చే పని లేకుండా భూముల మ్యుటేషన్ అయిపోతుందన్నారు. ధరణి పోర్టల్ ద్వారా ఇకపై తహసీల్దార్లు కూడా అవినీతికి పాల్పడే అవకాశమే లేదన్నారు. సబ్ రిజిస్ట్రర్లకు ఎలాంటి విచక్షణా అధికారం లేదన్నారు. పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. రిజిస్ర్టేషన్, మ్యుటేషన్, అప్‌డేషన్ కాపీలు వెంటనే వస్తాయన్నారు.