తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న అయుత చండీయగానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని పోలీసు శాఖ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఊహించిన దాని కంటే భారీగా భక్తులు యాగం చూసేందుకు వస్తుండటంతో జనాల్ని కంట్రోల్ చేసే దిశగా పోలీస్ శాఖ ప్రయత్నాలు షురూ చేసిందని చెబుతున్నారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చండీయాగానికి తొలిరోజు 50వేల మంది వస్తే.. రెండో రోజు లక్ష మందికి పైగా హాజరయ్యారు.
శుక్రవారం క్రిస్ మస్ కావటం.. శనివారం వీకెండ్.. ఆదివారం సెలవు రోజుల నేపథ్యంలో.. యాగానికి వచ్చే ప్రజల సంఖ్య భారీగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొదట అనుకున్న దాని ప్రకారం.. యాగానికి రోజుకు 50వేలు.. మహా అయితే లక్ష మంది లోపే వస్తారని భావించారు.
కానీ.. ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న చండీయాగానికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు.. యాగశాలలో చేస్తున్న పూజలు జరుగుతున్న విధానంపై ప్రసారం అవుతున్న విశేషాలు ప్రజల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి యాగం రాబోయే రోజుల్లోకష్టమన్న ప్రచారం ఊపందుకోవటంతో.. యాగాన్ని చూడాలన్న ఆసక్తి అంతకంతకూ పెరిగిపోతోంది.
ఇంత భారీగా ప్రజలు వచ్చిన పక్షంలో అనుకోని ప్రమాదం జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే.. ముందస్తు జాగ్రత్తగా యాగానికి వచ్చే ప్రజల్ని నియంత్రించేందుకు వీలుగా.. కొన్ని నిర్ణయాల్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలుత. యాగానికి వచ్చేందుకు వీలుగా పలు జిల్లాల నుంచి టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఆ బస్సుల సంఖ్యను పూర్తిగా తగ్గించాలని నిర్ణయించారు. అదే సమయంలో ఉదయం బస్సుల్ని తగ్గించటం.. మధ్యాహ్నం ఒక మోస్తరుగా బస్సుల్ని తిప్పాలని పోలీసులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్టీసీ అధికారులకు సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో.. యాగశాల వద్దకు ఒకేసారి భారీగా ప్రజలు చేరుకునే విధానాన్ని అడ్డుకట్ట వేయాలని.. క్రమ పద్ధతిలోనే భక్తజనుల్ని పంపాలన్న ఆలోచనలో ఉన్నారు. రానున్న రెండు (శని..ఆది) రోజుల్లో అత్యంత ప్రముఖులు వస్తున్ననేపథ్యంలో భద్రత మరింత కట్టుదిట్టం చేయాల్సి ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఏమైనా.. యాగం చూసేందుకు వస్తున్న భక్తజనాన్ని చూస్తున్న పోలీసుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది.