పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఈ ఎన్నికల్లోనూ సెంటిమెంట్ కు పెద్దపీట వేస్తున్నారు. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూలు విడుదల కానున్నందున ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తున్నది. దీనిని పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్లమెంట్ ఎలక్షన్లపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రికి కేసీఆర్ కు ఆది నుంచీ ఉమ్మడి కరీంనగర్ గడ్డ సెంటిమెంట్ గా కలిసి వస్తున్నది. ఇక్కడ ఏ కార్యక్రమం చేపట్టినా గమ్యాన్ని ముద్దాడి తీరుతుందన్న నమ్మకం సీఎంలో ఉన్నది. అందుకే నాటి 2014 అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు సమైక్య రాష్ట్రంలో జరిగిన అనేక ఎన్నికలకు ముందస్తు సభలను కరీంనగర్ వేదికగానే నిర్వహించారు. తాజాగా అదే ట్రెండ్ ఫాలో అయ్యారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాలుండగా, 16 స్థానాల్లో టీఆర్ ఎస్ జెండా ఎగరేసి తీరుతామని పలుసార్లు ప్రకటించారు. ఆ మేరకు కార్యాచరణ ప్రక్రియను ఆరంభించారు. ఇప్పటికే పార్టీశ్రేణులను కూడా ఆ దిశగా సన్నద్ధం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన విధానాన్నే ఈ ఎన్నికల్లోనూ అనుసరించే దిశగా అడుగులు వేస్తున్నారు. అసెంబ్లీతో పాటు పంచాయతీ ఎన్నికల్లోనూ గులాబీ హవా సాగింది. టీఆర్ ఎస్ అనుసరిస్తున్న విధానాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిశితంగా పరిశీలిస్తున్న ప్రజానీకం అన్నింటా అండగా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో లోక్ సభ ఎన్నికల్లోనూ అన్ని స్థానాల్లో టీఆర్ ఎస్ అభ్యర్థులే విజయఢంకా మోగిస్తారన్న ధీమా పార్టీలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో సెంటిమెంట్ కు సైతం ప్రాధాన్యం ఇస్తున్నారు.
సెంటిమెంట్ లో భాగంగానే, 2019 ఎన్నికల తొలి ప్రచార సభను కూడా ఉమ్మడి జిల్లాలోని హుస్నాబాద్ లో ఏర్పాటు చేశారు. ఆ మేరకు రాష్ట్రంలో అన్ని సభలూ విజయవంతం కావడమే కాదు, అత్యధిక సీట్లు సాధించి మరోసారి అధికారంలోకి వచ్చారు. ఈ సెంటిమెంట్ ను మరోసారి కొనసాగించబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే నాటికే అన్ని లోక్ సభ నియోజకవర్గాల్లో బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో మొదటి సభను కరీంనగర్ నుంచే ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. మార్చి ఒకటిన ఉదయం పది గంటలకు ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిపేందుకు నిర్ణయించినట్లుగా కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. నిజానికి కొద్ది రోజుల క్రితం సిరిసిల్లలో జరిగిన ఒక సమావేశంలో కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ వినోద్ కుమారే పోటీ చేస్తారని ప్రకటించారు. కరీంనగర్‌లో తొలి సమావేశం నిర్వహించడానికి ఇది కూడా ఒక కారణమని భావిస్తున్నారు. సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు, హుస్నాబాద్, హుజురాబాద్ నియోజకవర్గాల ప్రజలు సభకు హాజరుకానున్నారు.