తెలుగు రాష్ర్టాల నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. హాట్ హాట్ గా నేతలు పరస్పరం విమర్శలు - ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి సనత్ నగర్ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఏపీకి వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ ఆయన మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి తీరుతామని - ఆంధ్రప్రదేశ్ ప్రజలు టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వం లోటు బడ్జెట్ లో ఉందంటూనే టీవీలు - పత్రికల్లో ప్రచారం కోసం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఇలా తలసాని చేసిన కామెంట్లపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని దుర్గ గుడి వద్ద రాజకీయాలు చేశారని మండిపడ్డారు.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై తలసాని మీడియాతో మాట్లాడుతూ నిప్పులు చెరిగారు. ఫెడరల్ ఫ్రంట్ పేరు వింటేనే చంద్రబాబుకు వణుకు పుడుతుందని ఎద్దేవా చేశారు. ``చంద్రబాబు లాగా దేవాలయాల వద్ద రాజకీయాలు చేసే అలవాటు లేదు. నాకు అక్కడ బంధువులు ఉన్నారు. బంధుత్వాలు, బంధాల విలువ చంద్రబాబుకు తెలియదు. హరికృష్ణ చనిపోతే అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడిన నీచమైన సంస్కృతి చంద్రబాబుది. నేను మొన్న ఏపీకి వచ్చినందుకు బాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇలాగే హెచ్చరికలు చేస్తే బీసీలెవరూ టీడీపీలో ఉండరు. ఈ దేశానికి సేవ చేయాలనే సంకల్పంతో...ఫెడరల్ ఫ్రంట్ వేదికగా వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులను - నాయకులను కలుస్తున్నారు. దీంతో బాబుకు వణుకు పుట్టుకొని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. `` అంటూ విరుచుకుపడ్డారు.
తాను వందశాతం రాజకీయాలు మాట్లాడుతానని - చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తే సమాధానం తీవ్రంగా ఉంటుందని తలసాని హెచ్చరించారు. ``కులాల మధ్య చిచ్చు పెట్టిన వ్యక్తి చంద్రబాబే. మాల-మాదిగలకు - బీసీలకు-కాపులకు గొడవ పెట్టింది చంద్రబాబు. అలాంటి చంద్రబాబు టీఆర్ ఎస్ పార్టీ గురించి మాట్లాడడం దారుణం. ఈ బాబు మాకొద్దు అనే నినాదంతో ముందుకు పోతున్నామని ఆంధ్రా ప్రజలు చెప్పారు. ముసుగు తీసిన దొంగలు మీరు.. ఆ నాటకాలేంటో బయటపెడుతాం. చంద్రబాబుకు టైం దగ్గరపడింది. ఎన్టీఆర్ అభిమానులే చంద్రబాబును సాగనంపాలని చూస్తున్నారు`` అని కీలక వ్యాఖ్యలు చేశారు. ``ఏపీలో తప్పకుండా రాజకీయాలు చేస్తాం. అక్కడ మమ్మల్ని అభిమానించే వాళ్లున్నారు. నేను ఆంధ్రాలో బీసీ నాయకులను కలిస్తే చంద్రబాబుకు భయం పుట్టుకుంది. బడుగు - బలహీన వర్గాలు చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్తారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుంది. నేను ఏపీకి వెళ్తే ఆ స్థాయిలో ప్రజాస్పందన ఉంటే.. మా సీఎం కేసీఆర్ వెళ్తే ఏ రేంజ్ లో స్పందన ఉంటుందో ఊహించుకోండి`` అని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.