తెలంగాణ, ఆంధ్రా ప్రభుత్వాల మధ్య మంచి సఖ్యతే ఉంది. ఆ మాటకు వస్తే జగన్ ను బాబాయ్ కేసీఆర్ బాగానే చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉభయ ప్రాంతాల ప్రయోజనాల పరిరక్షణలో తేడాలు రాకూడదు కదా. వచ్చినా కనీసం సామరస్యంగా పరిష్కారం అవ్వాలి కదా. కానీ ప్రాంతాల సమస్యలు వచ్చేటప్పటికీ అలా జరగడం లేదు.
పర్సనల్ గా ఒకరికి ఒకరు హాయిగా సహకరించుకునే ఈ ఇద్దరు... ఇరు రాష్ట్రాల సమస్యల విషయానికి వచ్చేటప్పటికి... కోర్టులకు, ట్రైబ్యునల్స్ కు పోతున్నారు. అందుకనే చాలా సమస్యలన్నవి అపరిష్కృతంగానే ఉంటున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏటపాక మండలానికి చెందిన ముంపు గ్రామాలు కొన్ని తమను తెలంగాణలో కలిపేయ్యాలని అంటున్నారు.
దీనిపై ఇంతవరకూ జగన్ స్పందించలేదు కానీ మంత్రులు మాత్రం నోరు పారేసుకుంటున్నారు. అదేవిధంగా ఇదే విషయమై కూడా షర్మిల కూడా స్పందించలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మాట్లాడుతున్నవైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి మాట్లాడడం లేదు. ఇదే సమయాన జగన్ కూడా వ్యూహాత్మక మౌనం పాటించడం ద్వారా పొలిటికల్ గా వస్తున్న ఇబ్బందులను అధిగమించే చతురత చూపుతున్నారు.
టీడీపీ అధినేత బాబు మాత్రం స్పష్టంగా ఓ మాట చెప్పారు మీరు వాస్తవాలు తెలుసుకోలేనంత కాలం ఎటువంటి ప్రయోజనం ఉండదని, ప్రాజెక్టు ప్రగతి సాధ్యం కాదని తేల్చేశారు.
ఇప్పటికైనా విలీన స మస్య పై మాట్లాడాలి ఆ ఇద్దరూ.. అదే విధంగా కేసీఆర్ కూడా వీటిపై ఏదో ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కానీ అవేవీ లేకుండా మంత్రి పు వ్వాడ అజయ్ తో స్టేట్మెంట్లు ఇప్పించినా, భావోద్వేగ సంబంధ రాజకీయాలు, సెంటిమెంట్ పోలిటిక్స్ ఎన్ని చేసినా కూడా వృథానే అన్నది పరిశీలకుల మాట !