ఒకప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందంటే అందరికీ ఆసక్తి ఉండేది. ఆయన చెప్పే విషయాలు కొన్ని పేలుతూ ఉంటాయి. అలాగే బహిరంగ సభల్లోనూ ఆయన చేసే వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. అయితే గతేడాది కాలం నుంచి కేసీఆర్ పాల్గొన్న ప్రతీ సభలో కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారిన తరువాత వచ్చే ఎన్నికల్లో ఎన్డీయేకు బీఆర్ఎస్ చుక్కలు చూపిస్తుందని అంటున్నారు. అయితే తాజాగా నిర్వహించే ఖమ్మం సభలో కేసీఆర్ ఎలాంటి స్పీచ్ ఉంటుందోనని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే బహిరంగ సభలు నిర్వహించారు. బీఆర్ఎస్ గా మారిన తరువాత తొలిసారి ఖమ్మంలో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో ఆయన ప్రసంగం ఎలా ఉంటుంది..? అనేది సస్పెన్స్ గా మారిందని అంటున్నారు.
జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ఖమ్మం సభ ఉంటుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసే ప్రసంగం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటుందని అంటున్నారు. ఇప్పటి వరకు కేంద్రంపై విరుచుకుపడ్డ కేసీఆర్ ఇప్పుడు పార్టీ విధి విధానాలు, భవిష్యత్ లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రసంగిస్తారని అంటున్నారు. ఈ సభలో కేసీఆర్ తో పాటు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా కేవలం విమర్శలతోనే సమయం వృథా చేయకుండా భవిష్యత్ లో పార్టీ చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించనున్నట్లు సమాచారం.
ఇక ఈ సభకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ నుంచి నాయకులు, ప్రజలు వస్తున్నారు. అంటు రెండు రాష్ట్రాల వారిని సంతృప్తి పరిచే విధంగా ఆయన ప్రసంగం ఉండాలి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తరువాత విభజన హామీలు విస్మరించిందని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కోర్టుకెక్కింది. అటు పోలవరం ఎత్తు పెంచొద్దని మంత్రులు పోరాటం చేస్తున్నారు. ఈ తరుణంలో రెండు రాష్ట్రాల ప్రజలకు ఏ విధమైన హామీ ఇస్తారో చూడాలని అంటున్నారు. ఖమ్మంలో ఈ సభను నిర్వహించడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజలను ఆకట్టుకోవాలని చూస్తున్నారు. అయితే ఆయన చేసే ప్రసంగం కూడా ఆ విధంగానే ఉంటుందని అంటున్నారు.
కేవలం జాతీయ రాజకీయాల గురించి మాత్రమే కాకుండా ఖమ్మంలో గులాబీ పార్టీ పట్టు సాధించే దిశగా ఆయన మాట్లాడుతారని అంటున్నారు. కారు పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఖమ్మం జిల్లాలో పూర్తి స్థాయిలో సీట్లు సాధించలేదు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో ఈ జిల్లాను కైవసం చేసుకునేందుకు పలు హామీలు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే స్థానిక నాయకులకు కొన్ని పదవులు కూడా ఆఫర్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదిలా ఉండగా.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పలు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని కేసీఆర్ అంటున్నారు. అయితే కేరళ, ఢిల్లీ, పంజాబ్ లల్లో బీఆర్ఎస్ ఎలాంటి కార్యక్రమాలపై కేసీఆర్ ఏం చెబుతారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే కర్ణాటకలో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కేసీఆర్ చెబుతుండగా.. మంత్రులు మాత్రం కేవలం మద్దతు ఇస్తుందని అంటున్నారు. ఇక తాజాగా ఆయన కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లోనూ మద్దతు వరకే వెళితే ఇక జాతీయ రాజకీయాలు ఎక్కడ చేస్తారని ప్రశ్నించే అవకాశం ఉంది. అందువల్ల ఖమ్మం సభలో కేసీఆర్ చేసే ప్రసంగం కీలకంగా మారే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.