మహాకూటమి అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సీట్లు - టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నోట్లు ఇస్తున్నారని వారికి సరైన బుద్ది చెప్పాలని మంత్రి కేటీఆర్ అన్నారు. దొంగలు దొంగలు ఒక్కటయ్యారని కాంగ్రెస్ - టీడీపీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో జరిగిన రైతు కృతజ్ఞతా సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్... గత ప్రభుత్వాలు రైతులను నిర్లక్ష్యం చేశాయన్నారు. విత్తనాల కోసం - ఎరువుల కోసం రైతులు ఎంతో ఇబ్బందులు పడ్డారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను చిన్నచూపు చూశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి అని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు 17 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామన్నారు.
రైతుల కోసం తామెంతో చేస్తున్నామని పేర్కొన్న కేటీఆర్...కూటమి అధికారంలోకి వస్తే నష్టాలేనని వెల్లడించారు. "రైతు బీమా రైతు కుటుంబానికి ధీమా - దేశంలో తెలంగాణలో తప్ప ఎక్కడా లేదు. ప్రాజెక్టులపై కాంగ్రెస్ వాళ్లు దొంగ కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారు. చంద్రబాబు కూటమికి ఓటు వేసి మన జుట్టు చంద్రబాబు చేతిలో పెడదామా? 453 పథకాలు తెలంగాణ ప్రజల కోసం చేపట్టాం. కలిసి కూర్చొని సీట్లు పంచుకునే దమ్ము లేదు గానీ.. రేపు కలిసి ప్రభుత్వాన్ని నడిపిస్తారట. ముష్టి మూడు సీట్ల కోసం రాహుల్ గాంధీ చుట్టు పొర్లు దండాలు పెడుతున్నారు. సోనియా గాంధీని చంద్రబాబు ఎన్నో తిట్లు తిట్టాడు. కానీ మళ్లీ కాంగ్రెస్ వాళ్లు చంద్రబాబుతో జతకట్టారు. వచ్చే ఎన్నికలు తెలంగాణ రైతులు తమ రాతలు తామే రాసుకునే ఎన్నికలు.. ఆలోచించి ఓటు వేయండి. తెలంగాణ అంటేనే పోరాటల గడ్డ. ఆ గడ్డ పవర్ ను మీ ఓటుతో చూపించండి.." అంటూ మంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వాల హయాంలో ఎరువులను పోలీస్ స్టేషన్ కు పోయి తీసుకునే పరిస్థితి ఉండేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ``దయలేని ప్రభుత్వంలో రైతుల్ని గంజిలో ఈగలా చూసేవారు. గతంలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతుల స్థితిని మార్చలేక పోయ్యాయి. టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత వెనుకబడిన 80 నియోజకవర్గాలను సస్యశ్యామలం చేశాం. దాని కోసం కాళేశ్వరం నిర్మాణం చేపట్టాం. కేసీఆర్ రైతులకు చేసిన విధంగా 16 మంది ప్రధాన మంత్రులు కూడా చేయలేకపోయ్యారు. ` అని ఆయన వివరించారు.