టీఆర్ ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు... నిజంగానే అంతా ఉల్టా పల్టా చేస్తున్నారా?. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ఇలానే ఉంటున్నాయా? అసలు కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఎంతమేర ఉపయుక్తంగా ఉంటున్నాయి? ఈ ప్రశ్నలకు ఇప్పటిదాకా సమాధానాలు లేవు గానీ... ఇటీవల ఆయన చేసిన ఒకే ఒక్క ప్రకటనతో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికేసిందనే చెప్ప తప్పదు.కేసీఆర్ నిర్ణయాలన్నీ ఉల్టా పల్టాగానే ఉన్నాయని ఈ ఒక్క ప్రకటన నిరూపిస్తోందన్న వాదన కూడా ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. అయితే ఆ ప్రకటన ఏంటీ? దానిలో ఉన్న మర్మమేంటీ? అన్న విషయాల్లోకి వెళ్టిపోదాం పదండి.
టీఆర్ ఎస్ 14 ఏళ్ల పాటు సాగించిన ఉద్యమం ద్వారా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైపోయింది. ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు తమ తొలి సీఎంగా ఎన్నుకున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగానే ఆస్వాదించని కేసీఆర్ ముందస్తు ఎన్నికకు వెళ్లారు. మరోమారు బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణకు వరుసగా రెండో పర్యాయం కూడా ఆయనే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి చాలా ముందుగానే 10 జిల్లాల తెలంగాణను ఏకంగా 31 జిల్లాల తెలంగాణగా మార్చేశారు.
ఎన్నికలకు ముందు మరో రెండు కొత్త జిల్లాలను ప్రతిపాదించిన కేసీఆర్... మొత్తం జిల్లాల సంఖ్యను 33కు చేర్చేస్తున్నారు. తక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాలతో మారుమూలన ఉన్న ప్రజలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్న ఒకే ఒక్క సంకల్పంతోనే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా కేసీఆర్ నాడు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. సరే... ఇక్కడిదాకా బాగానే ఉన్నా... ఇప్పుడు కొత్తగా డివిజన్ల వ్యవస్థను తీసుకొచ్చేస్తున్నామంటూ కేసీఆర్ మరో కొత్త ప్రకటన చేశారు. నాలుగైదు జిల్లాలను ఓ డివిజన్ కిందకు తీసుకొచ్చేసి... జిల్లాల్లో జరుగుతున్న పాలనను పర్యవేక్షిస్తారట.
అయినా... గతంలో డివిజన్లు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు కొత్తగా డివిజన్ల మాటేమిటి? అనే డౌటు వస్తోంది కదా. నిజమే... గతంలో రెవెన్యూ డివిజన్ల వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు ఏపీలోనూ, గతంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ వ్యవస్థ ఉన్నది. ఈ వ్యవస్థలో 25 నుంచి 30 మండలాలతో ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్ కు ఆర్డీఓ అధికారిగా ఉంటారు. రెండు లేదా మూడు రెవెన్యూ డివిజన్లను కలిపి ఓ జిల్లాగా ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు కేసీఆర్ కొత్తగా ఏరపాటు చేయబోయే డివిజన్ల స్వరూపం ఎలా ఉంటుందంటే... నాలుగైదు జిల్లాలను కలిపి ఓ డివిజన్ గా ఏర్పాటు చేస్తారట. దానికి కలెక్టర్ స్థాయి కంటే ఉన్నత స్థాయిలో ఉండే ఐఏఎస్ అధికారులను డివిజన్ల బాధ్యులుగా చేస్తారట.
కొత్త జిల్లాల ఏర్పాటుతో రెవెన్యూ డివిజన్ల వ్యవస్థను దాదాపుగానే తీసేసిన కేసీఆర్.... ఇప్పుడు నాడు జిల్లాలుగా ఉన్న ప్రాంతాలను డివిజన్లుగా ఏర్పాటు చేస్తారన్న మాట. నాడు రెండు నుంచి మూడు రెవెన్యూ డివిజన్లు జిల్లాల కింద ఉంటే... ఇప్పుడు నాలుగైదు జిల్లాలను ఓ డివిజన్ గా ఏర్పాటు చేస్తారట. అంటే నాడు జిల్లాలుగా పరిగణించిన ప్రాంతం ఇప్పుడు డివిజన్ గా మారితే... ఇప్పటికే డివిజన్లన్నీ జిల్లాలుగా మారిపోయాయి కదా. అందుకే కేసీఆర్ నిర్ణయాలన్నీ ఉల్టా పల్టాగానే ఉన్నాయన్న ఓ కొత్త వాదన ఇప్పడు ఆసక్తి రేపుతోంది.