'మౌనికకు తల్లి, తండ్రి అన్నీ నేనే'... మనోజ్ కీలక వ్యాఖ్యలు!
మంచు ఫ్యామిలీలో మంటలు ఎపిసోడ్ లో రెండు రోజులుగా మనోజ్ భార్య మౌనిక పేరు బాగా వినిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
మంచు ఫ్యామిలీలో మంటలు ఎపిసోడ్ లో రెండు రోజులుగా మనోజ్ భార్య మౌనిక పేరు బాగా వినిపిస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మోహన్ బాబు ఇంట్లో పని మనిషి చెప్పిన మాటలు కానీ.. మోహన్ బాబు ఆడియో బైట్ లో కానీ.. మౌనిక ఈ పరిస్థితి ఒక కారణం అనే సంకేతాలు తెరపైకి తెచ్చారని అంటున్నారు.
మౌనికను మనోజ్ వివాహం చేసుకోవడం మోహన్ బాబు ఇంట్లో ఇష్టం లేదని పని చేసే మహిళ చెప్పడం.. ఈ విషయంపై విష్ణును మీడియా ప్రశ్నించగా.. మనోజ్ పెళ్లి వల్ల అయితే సమస్య కాదని చెప్పుకొచ్చారు. మోహన్ బాబు మాత్రం.. పెళ్లి అయ్యాకే మనోజ్ తాగుడుకు బానిసైపోయాడని, మారిపోయాడని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో మనోజ్ స్పందించారు.
అవును... మంచు కుటుంబంలో జరుగుతున్న తాజా సమస్యల్లో మౌనిక కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారనే చర్చ జరుగుతుందని అంటున్నారు. ఈ సమయంలో మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... "నా భార్య వచ్చిన తర్వాత నేను చెడ్డోడిని అయ్యాయని.. అదే ఆమె తల్లి తండ్రులు ఉండుంటే.. ఊరుకుంటారా?" అని మనోజ్ ప్రశ్నించారు.
ఈ సందర్భంగా... తాను కూడా మౌనంగా ఉంటే ఎలా అని ప్రశ్నించిన మనోజ్... తన భార్యకు తల్లి తయినా తండ్రి అయినా తానేనని అన్నారు. ఆమె వాళ్ల ఇంట్లో ఆధారపడదని.. తాను తన ఇంట్లో ఆధారపడనని.. తాను సొంతంగా సినిమాలు చేసుకుంటున్నానని.. ఆమె సొంతంగా ఓ టాయ్ కంపెనీ పెట్టుకుందని మనోజ్ తెలిపారు.
లాక్ డౌన్ సమయంలో "అహం బ్రహ్మస్మీ" సినిమా తన ప్రేమ కోసం ఆపేసినప్పుడు తాము చెన్నైకి షిఫ్ట్ అయిపోయామని.. అక్కడ కూర్చుని చర్చించుకున్నామని తెలిపారు. ఈ సమయంలో ఫ్రెండ్స్ వద్ద కొంచెం అప్పులు చేసుకుని, పెట్టుబడులు పెట్టుకుంటూ ఈ రోజు స్నేహితుల సహాయంతో తాను, తన భార్య నిలదొక్కుకున్నట్లు మనోజ్ తెలిపారు.
ఇదే సమయంలో... "మా నాన్న మీద గన్ను పెట్టి కాల్చే వినయ్ కి, మా అన్నకి సాయంత్రం ప్రతీదీ చెబుతాను.. వినయ్, మా అన్న విష్ణు కారణంగానే మా నాన్న నాన్నలా లేరు.. పూర్తిగా మారారు.. చోరీకి గురైన సీసీ కెమెరా విజువల్స్ తెప్పిస్తే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి" అంటూ మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.