మన్ను తిన్న పాములా ఉన్నట్లుగా కనిపిస్తూనే అంతలోనే కింగ్ కోబ్రాలా రియాక్టు కావటం అందరికి సాధ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి మినహాయింపుగా చెప్పాలి. రాష్ట్రంలో పాలన అనేది ఒకటి ఉందా? ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కు రారు. మంత్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వరు. అయితే.. ఫాంహౌస్ కాదంటే ప్రగతిభవన్ లో ఉండే సీఎం.. జిల్లాల పర్యటన కూడా అంతంత మాత్రమే. ఇదెక్కడి ముఖ్యమంత్రి అన్నట్లుగా అనిపిస్తున్న వేళలోనే.. వరుస పెట్టి నిర్ణయాల్ని తీసుకోవటమే కాదు.. మహా దూకుడుగా పాలనా యంత్రాంగాన్ని పరుగులు తీయించటం కేసీఆర్ మార్కుగా చెప్పాలి.
తాజాగా నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పెద్ద ఎత్తున నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్క సమావేశంలో పెద్ద ఎత్తున కీలక నిర్ణయాలు తీసుకోవటం విశేషం. అంతేకాదు.. కరోనా అనుభవాల నేపథ్యంలో వైద్యానికి.. వైద్య సేవలకు పెద్ద పీట వేయటం కనిపిస్తోంది. ఇటీవల కాలంలో వైద్య సేవల విషయానికి సంబందించి వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్న కేసీఆర్.. ఈ రోజు (బుధవారం) నుంచి జిల్లాల్లో రోగ నిర్దారణ కోసం డయాగ్నస్టిక్ సేవలకు అనుగుణంగా పెద్ద ఎత్తున ఉచిత పరీక్షా కేంద్రాల్ని ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే.
దేశంలోనే అత్యుత్మ వైద్య సేవల్ని అందించే ఎయిమ్స్ స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో పౌరుల ఆరోగ్య సమాచారం నమోదును రాజన్న సిరిసిల్ల.. ములుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. అంతేకాదు.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్థితిగతులు.. మెరుగైన సౌకర్యాలు.. సిబ్బంది.. ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు.
దీనికి ఆర్థిక మంత్రి హరీశ్ అధ్యక్షులుగా వ్యవహరిస్తే.. మంత్రులు జగదీశ్ రెడ్డి.. శ్రీనివాస్ గౌడ్.. తలసాని శ్రీనివాస్ యాదవ్.. వేముల ప్రశాంత్ రెడ్డి.. సబితారెడ్డి.. సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉండనున్నారు. మొత్తం ఏడుగురు మంత్రులతో నియమించిన ఈ టీం.. దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు.. కేరళ రాష్ట్రాలతోపాటు పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అధ్యయనం చేయనున్నారు. సమగ్ర నివేదికను ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. దీంతో.. వరుస టూర్లకు వెళ్లేందుకు ఈ ఏడుగురు మంత్రులకు అవకాశం లభించనుంది.