ఎన్నికల ప్రచారంలో అందరికన్నా ముందున్న టీఆర్ఎస్ మరింత దూసుకుపోయేందుకు ప్లాన్ చేసింది. ప్రత్యర్థులను మానసికంగా దెబ్బతీయడంలో ఎప్పుడూ టీఆర్ఎస్ దే పైచేయి. మహాకూటమి ఇంకా సీట్ల సర్ధుబాటు కోసం చర్చలు జరుపుతుండగానే కేసీఆర్ మాస్టర్ స్కెచ్ గీశారు. ప్రత్యర్థులకు అందనంత స్పీడుతో ప్రచార పర్వానికి ప్లాన్ చేశారు.
నవంబర్ తొలి వారం నుంచి ప్రచారంతో దుమ్ము దులిపేందుకు టీఆర్ఎస్ తాజాగా మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది.. కూటమిలో సీట్లు పంచుకోవడానికి ముందే టీఆర్ఎస్ స్వీట్లు పంచుతుందంటూ ప్రచార సభల్లో ఇప్పటికే మంత్రి కేటీఆర్ పంచులు విసురుతున్నారు. ఆయన అన్నట్టే మహాకూటమి సీట్ల సర్ధుబాటు ఎంతకూ తేలడం లేదు. వీరు ఎప్పుడు ప్రకటిస్తారు. ఆ అభ్యర్థులు ఎప్పుడు ప్రచారాన్ని మొదలు పెడుతారు. ఎప్పుడు టీఆర్ఎస్ వేగాన్ని అందుకుంటారన్నది కాంగ్రెస్ లోని నేతల్లో కలవరపెడుతోందట.. మరో వైపు కూటమిలో జాప్యం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
గులాబీ దళపతి కేసీఆర్ ఒక్కసారి ప్రసంగించి హామీ ఇస్తే చాలు తమ నియోజకవర్గంలోని అసమ్మతి, అసంతృప్తి చల్లారి తాము గెలుపు గుర్రం ఎక్కుతామని టీఆర్ఎస్ అభ్యర్థులు భావిస్తున్నారు. 100 సీట్లే టార్గెట్ గా దూసుకెళ్తున్న కేసీఆర్ తెలంగాణలోని టీఆర్ఎస్ అభ్యర్థులకు జోష్ నింపేలా గ్రేటర్ హైదరాబాద్ మినహా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న 90 నియోజకవర్గాల్లో నవంబర్ తొలి వారం నుంచి బహిరంగ సభల్లో ప్రసంగించేందుకు ప్లాన్ చేసుకున్నారు. హెలీ క్యాప్టర్ ద్వారా ఒకే రోజు రెండు, మూడు సభలకు ఆయన ప్లాన్ చేశారు. ఒక్కో సభల్లో 45 నిమిషాల చొప్పున కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇందుకోసం అభ్యర్థులందరినీ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించాడట..
తెలంగాణ వ్యాప్తంగా 90 నియోజకవర్గ సభల్లో .. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో 3 నుంచి 5 సభల్లో కేసీఆర్ ప్రసంగించనున్నారట.. ఇక కేటీఆర్ కు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 23 నియోజకవర్గాల్లో ప్రచార బాధ్యతను.. మహానగరం హైదరాబాద్ లోని ప్రతీ కాలనీలో కేటీఆర్ ప్రసంగించేలా ప్లాన్ సిద్ధం చేశారు. హైదరాబాద్ మినహా హరీష్ రావుకు తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గాల ప్రచార బాధ్యతను, కూతురు కవితకు ఉత్తర తెలంగాణ బాధ్యతలను కేసీఆర్ అప్పగించారట.. ఇలా ఫ్యామిలీ ప్యాక్ తో తెలంగాణలో టీఆర్ఎస్ ను మళ్లీ గెలిపేందుకు భారీ సభలకు ప్లాన్ చేశారు గులాబీ దళపతి..