చెప్పిందే చేస్తా అన్నట్లుగా కొంతమంది అధినేత తీరు ఉంటుంది. చెప్పిందేదీ చేయరన్న పేరు మరికొందరు అధినేతలకు ఉంటుంది. ఏ నిమిషాన ఎలా ఉంటారోఏ మాత్రం అర్థం కాకుండా వ్యవహరించే తీరు ఇంకొందరిలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహారం మూడో కోవకు చెందుతుంది. ఆయన చెప్పే మాటలు విన్నప్పుడు ఎంతో హాయిగా ఉంటాయి.
నమ్మకంగా చెప్పే ఆయన మాటల్నిభూప్రపంచంలో నమ్మని వారంటూ ఎవరూ ఉండరు. ఆ తత్వమే ఏ మాత్రం వచ్చే ఛాన్స్ లేదని తేల్చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేలా చేసిందని చెప్పాలి. రాజకీయాల్ని కాసేపు పక్కన పెట్టేస్తే.. బాలయ్య కెరీర్లో మైల్ స్టోన్ లాంటి వందో సినిమాను చారిత్రక కథాంశమైన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా ఒక సంచలనంగా చెప్పాలి.
అరకొరగా ఉన్న చారిత్రక ఆధారాలతో ఒక సినిమాను తీయటం అంత తేలికైన విషయం కాదు. అయితే.. ఆ అనుమానాల్ని పటాపంచలు చేస్తే.. అద్భుతమైన సినిమాగా శాతకర్ణిని తీర్చిదిద్దారంటూ రాజమౌళి లాంటి దర్శకుడు సర్టిఫికేట్ ఇవ్వటం ఇప్పుడు ఈ సినిమాపై అందరి చూపు మరింత ఎక్కువ పడేలా చేసిందని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈసినిమా విడుదలైన వేళ.. తన కోసం ప్రత్యేక షో వేయాలని.. దానికి తనతో పాటు.. అందరిని పిలవాలంటూ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడగటం.. తప్పనిసరిగా అంటూ బాలయ్య చెప్పటం తెలిసిందే.
ఈ మధ్యన సినిమా విడుదలకు సంబంధించిన వివరాల్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు బాలయ్య ఇచ్చి వచ్చారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసాద్ ఐమాక్స్ లో స్పెషల్ షో వేస్తున్నారని.. దానికి సీఎం కేసీఆర్ హాజరవుతారన్న ప్రచారం జరిగింది. ఓపక్క పాజిటివ్ టాక్ తో దూసుకెళుతున్న శాతకర్ణిని.. సీఎం కేసీఆర్ చూసేందుకు టైం ఫిక్స్ కావటం లాంటివి ఈ సినిమాపై మరింత చర్చను పెంచింది. అయితే.. మీడియాలో వచ్చినట్లుగా ఉదయం 11 గంటలు దాటి పోయినా.. కేసీఆర్ ఊసు లేకపోవటం గమనార్హం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. స్పెషల్ షోకు కేసీఆర్ గౌర్హాజరీ అయ్యారు. ఎందుకిలా అన్న అంశంపై వివరాలు బయటకు రాలేదు. కేసీఆర్ వస్తారని ఆశగా చూసిన వారికి నిరాశే మిగిలిందని చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/