కొండ‌గ‌ట్టుకు వెళ్ల‌లేరు కానీ గ‌వ‌ర్న‌ర్ కు బొకేనా కేసీఆర్?

Update: 2018-09-14 06:37 GMT
ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు.. ప‌ది మంది అస‌లే కాదు. ఏకంగా 60 మందికి పైగా సామాన్య ప్ర‌జ‌లు ప్ర‌భుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీబ‌స్సులో ప్ర‌మాదానికి గురై మ‌ర‌ణిస్తే.. అంత‌టి ఘోర విషాదాన్ని చూసేందుకు.. గుండెలు అవిసేలా రోదిస్తున్న బాధిత కుటుంబాల‌కు కాస్తంత సాంత్వ‌న క‌లుగ‌ని ప‌రిస్థితి.

కొండంత విషాదాన్ని క‌డుపులో పెట్టుకొని రోదిస్తున్న బాధితుల‌ను ప‌రామ‌ర్శించేందుకు సీఎం కేసీఆర్ రాక‌పోవ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.ప్ర‌భుత్వ అధికారుల నిర్ల‌క్ష్యంతో పాటు.. ప్ర‌మాదం జ‌రిగిన త‌ర్వాత ఆప‌ద్ద‌ర్మ ప్ర‌భుత్వం స్పందించిన తీరుపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు విరుచుకుప‌డుతున్నాయి.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇంత పెద్ద విషాద ఘ‌ట‌న చోటు చేసుకున్న త‌ర్వాత ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రి కేసీఆర్ రాక‌పోవ‌టం.. ప‌రామ‌ర్శ అంశాన్ని సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌టంపై ప‌లువురు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.

పోయిన ప్రాణాల్ని వెన‌క్కి తీసుకురాలేక‌పోయినా.. అయిన వాళ్ల‌ను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న‌ప్పుడు ప‌లుక‌రించేందుకు క‌నీసం రావాల్సిన అవ‌స‌రం ఉంది.

అయితే.. అందుకు భిన్నంగా కేసీఆర్ బాధితుల్ని ప‌రామ‌ర్శించ‌క‌పోవ‌టం.. క‌నీసం మృతుల‌ను చూసేందుకు కేసీఆర్ రాక‌పోవ‌టాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. వినాయ‌క‌చ‌వితి సంద‌ర్భంగా రాజ్ భ‌వ‌న్ లో ఉన్న గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ ను క‌లిసేందుకు గురువారం వెళ్లిన ఆయ‌న బోకే చేతికి ఇచ్చి.. పండుగ శుభాకాంక్ష‌లు చెప్ప‌టంతో పాఉ దాదాపు గంట‌న్న‌ర‌కు పైనే వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. ప‌దుల సంఖ్య‌లో అయిన వాళ్ల‌ను పోగొట్టుకున్న వారిని ప‌రామ‌ర్శించాల్సిన బాధ్య‌త ఆప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రికి ఉన్నా.. ఆయ‌న మాత్రం అదేమీ ప‌ట్ట‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తూ.. గ‌వ‌ర్న‌ర్ ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌ల‌వ‌టం. ఆయ‌న‌తో ముచ్చ‌ట్లు పెట్ట‌టంపై పెద్ద ఎత్తున ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇంత‌కూ కొండ‌గ‌ట్టు బాధితుల ఇళ్ల‌కు వెళ్లే టైం లేన‌ప్పుడు.. గ‌వ‌ర్న‌ర్ సాబ్ కు మాత్రం టైం ఎలా కేటాయిస్తార‌న్న ప్ర‌శ్న‌కు గులాబీ నేత‌లు ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. దేశ చ‌రిత్ర‌లో మ‌రెప్పుడు లేని రీతిలో బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు వినాయ‌క‌చ‌వితి పండ‌గ‌ శుభాకాంక్ష‌ల కోసం అంతేసి స‌మ‌యాన్ని కేటాయించాల్సిన అవ‌స‌రం ఉందా?

Tags:    

Similar News