దాదాపు నెల రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో..ఎట్టకేలకు...ముఖ్యమంత్రి కేసీఆర్ మిత్రుడు...టీఆర్ ఎస్ మిత్రపక్ష నాయకుడైన హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ...తాజాగా స్పందించారు. 5100 ఆర్టీసీ బస్సు రూట్లను ప్రైవేటు పరం చేయడంతో పాటుగా కార్మికులు నవంబరు 5 లోపు విధుల్లో చేరొచ్చని సీఎం కేసీఆర్ శనివారం రాత్రి ప్రకటించిన నేపథ్యంలో ఓవైసీ తాజాగా రియాక్టయ్యారు. ఇటు కార్మికులకు...అటు కేసీఆర్ కు తన ప్రతిపాదనలు చేశారు. కాంగ్రెస్ - బీజేపీలను నమ్మొద్దు.. ఉద్యోగాల్లో చేరండి అని కార్మికులను ఓవైసీ కోరారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల కొందరి ప్రాణాలు పోవడం బాధాకరమని ఓవైసీ పేర్కొన్నారు. కాంగ్రెస్ - బీజేపీ రాజకీయాల కోసం ఆర్టీసీ యూనియన్లను వాడుకుంటున్నాయని - ఆ పార్టీలను నమ్మొద్దని సూచించారు. విధుల్లో చేరేందుకు కేసీఆర్ పెట్టిన ప్రపోజల్ కు ఒప్పుకోవాలని కార్మికులకు ఓవైసీ సలహా ఇచ్చారు. కార్మికులెవరూ ఆత్మ త్యాగాలకు పాల్పడొద్దని - ఆర్టీసీ విషయంలో ఏర్పడిన సందిగ్ధం త్వరలోనే తొలగిపోతుందని అసదుద్దీన్ ఓవైసీ భరోసా ఇచ్చారు.
ఇదిలాఉండగా - కేసీఆర్ కు సైతం అసదుద్దీన్ ఒవైసీ ప్రతిపాదన చేశారు. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసినా నిజాం తల్లి గుర్తును మాత్రం చెరపొద్దంటూ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ను పాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తల్లి జహ్రా బేగం పేరు మీద ఆర్టీసీ బస్సుల నంబరు ప్లేట్ల పై ‘Z’ అక్షరం ఉందని పేర్కొంటూ... ‘Z’ అక్షరాన్ని అలానే కొనసాగించాలని కోరారు. హైదరాబాద్ చరిత్రలో భాగమని - దాని అలానే ఉంచాలని కోరారు. 5100 ఆర్టీసీ బస్సు రూట్లను ప్రైవేటు పరం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపైనా ఒవైసీ ఈ విధంగా స్పందించారు.