తెలంగాణ ఆర్టీసీ సమ్మె సకలజనుల సమ్మెగా మారబోతుందా .. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఇప్పటికే సమ్మె ప్రారంభమై 26 రోజులు కావొస్తుంది. కానీ , సమ్మె పై తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కనీసం ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరపడానికి కూడా సముఖంగా లేదు. ఆర్టీసీ విషయంలో వెన్కక్కి తగ్గేది లేదు అని తేల్చిన సీఎం కేసీఆర్ కి హైకోర్టు చురకలు అంటించింది. ఆర్టీసీ పై ప్రభుత్వం ద్వంద వైఖరి ని హైకోర్ట్ సీరియస్ గా పరిగణించింది.
కార్మికుల డిమాండ్స్ ని పరిష్కారించకుండా .. ఆర్టీసీ కథ ముగియబోతుంది అని చెప్పడం సీఎం కేసీఆర్ కి ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. ఉద్యోగాల నుండి తీసేస్తున్నాం అని అంటే కార్మికులు వెన్కక్కి తగ్గుతారు అని అనుకున్నాడు. కానీ , కార్మికులు ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్స్ ని పరిష్కరించేవరకు తగ్గేదే లేదు అని తేల్చి చెప్తున్నారు. ఇక దీనిపై కోర్ట్ లో వాదనలు జరుగుతూనే ఉన్నాయి. 47 కోట్ల రూపాయలు ఆర్ టిసికి తక్షణమే ఇవ్వలేమన్న ప్రభుత్వ వాదనను హైకోర్ట్ ప్రస్తావిస్తూ హుజూర్ నగర్ ఉప ఎన్నికలో వంద కోట్ల హామీలిచ్చిన ప్రభుత్వం ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీకి రూ.47కోట్లు ఇవ్వలేదా అని ప్రశ్నించింది.
ప్రజల ఇబ్బంది పడకుండా తగినన్ని బస్సులు ఏర్పాటు చేశామని చెప్తూనే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారని కోర్టు గుర్తుచేసింది. ఇప్పటికీ మూడో వంతు బస్సులు నడవడం లేదని - సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు చెప్పడంతో ఆత్మ రక్షణలో పడింది ప్రభుత్వం. ఇకపోతే నేడు ఆర్టీసీ తెలంగాణ జెఎసి సకల జనుల సమరభేరీ సభ ని తలపెట్టింది. ఈ సభకి అనుమతి ఇవ్వాలని పోలీసులని కోరగా సభకి అనుమతి ఇవ్వలేదు. దీనితో హైకోర్టు కి వెళ్లి సభకి అనుమతి తెచ్చుకున్నారు. ఈ సకల జనుల సమరభేరీ సభ ఈ రోజు మధ్యాహ్నం 2 నుండి 5 వరకు సరూర్ నగర్ లో జరగనుంది. ఒకవైపు కోర్టు లో అక్షింతలు ..మరోవైపు ఇతరపార్టీల నుండి విమర్శలతో కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల డిమాండ్స్ కి తలవంచక తప్పేలా లేదు.