కేంద్ర బడ్జెట్ కు అంతా సిద్ధమైపోయింది. కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ మోస్ట్ అధికారులతో పాటు ఆర్థిక రంగ వేత్తలు నెలల తరబడి రూపొందించిన బడ్జెట్... ఇప్పటికే ప్రతుల రూపంలో పార్లమెంటుకు చేరిపోయింది. రేపు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరగనున్న కేబినెట్ భేటీ దీనికి అనుమతి ఇవ్వగానే... ఆ బడ్జెట్ ప్రతులను సూట్ కేసులో పెట్టేసుకుని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ః జైట్లీ పార్లమెంటు మెట్లెక్కనున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు మెట్లపై బడ్జెట్ ప్రతులున్న సూట్ కేసుతో ఫొటోలకు ఫోజులివ్వనున్న జైట్లీని చూసేందుకు దేశం యావత్తు ఆసక్తి కనబరుస్తోంది. ఎందుకంటే మోదీ నేతృత్వంలో గద్దెనెక్కిన యూపీఏ సర్కారు తన ఐదేళ్ల టెర్మ్ లో పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ ఇదే కాబట్టి. ఎన్నికల వేళ జనరంజకంగా ఉన్న బడ్జెట్‌నే జైట్లీ రూపొందించి ఉంటారని భావిస్తున్నా... ఏఏ వర్గాలకు ఏమేం వరాలు ప్రకటించనున్నారు? ఏఏ రాష్ట్రాలకు ఎలాంటి ప్రయోజనాలు చేకూర్చనున్నారు అన్న ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తికరంగానే మారాయని చెప్పక తప్పదు.
ఈ బడ్జెట్ ద్వారా తెలుగు నేలకు చెందిన ఏపీ ఏం కోరుకుంటోందన్న విషయాన్ని ఇప్పటికే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు తెలుగు నేలకే చెందిన రెండో రాష్ట్రం తెలంగాణ వంతు వచ్చిందనే చెప్పాలి. రాష్ట్ర విభజన తర్వాత ధనిక రాష్ట్రంగానే అవతరించిన తెలంగాణకు ఆర్ఙక పరంగా పెద్దగా ఇబ్బందులేమీ లేకున్నా... విభజన చట్టంలో పేర్కొన్న కొన్ని అంశాల్లో మాత్రం ఇంకా న్యాయం జరగలేదనే చెప్పాలి. మొత్తంగా ఈ బడ్జెట్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకించి ఆ రాష్ట్ర సీఎంగా ఉన్న టీఆర్ ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏం ఆశిస్తున్నారన్న విషయం ఇప్పుడు నిజంగానే ఆసక్తికరంగా మారిందని చెప్పక తప్పదు. ఈ బడ్జెట్‌లో తమకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందన్న ధీమా కేసీఆర్ లో కనిపిస్తున్నా... గతానుభవాలను బేరీజు వేసుకుంటున్న ఆయనలో కొన్ని అనుమానాలు కూడా లేకపోలేదనే వాదన వినిపిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటిదాకా తెలంగాణకు కేంద్రం నుంచి పెద్దగా సహకారం అందలేదనే చెప్పాలి. అయితే ఇప్పటిదాకా పరిస్థితి వేరని, ఇప్పుడు కాకుంటే మరెప్పుడు అన్న భావనతో మోదీ ఎంతో కొంత మేర తెలంగాణకు సాయం చేస్తారని తెలంగాణ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ మీడియా సమావేశం పెట్టి మరీ తెలంగాణ ఆశలను, ఆకాంక్షలను వెల్లడించారు. మరి దీనిపై ఈటెల ఏమన్నారన్న విషయానికి వస్తే... వివిధ కేంద్ర పథకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా కేంద్రం నుంచి ఇప్పటి దాకా సహాయం అందలేదన్నారు. ఈ సంవత్సరమైనా తోడ్పాటును అందిస్తుందని భావిస్తున్నామని ఆయన చెప్పారు. అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణకు తోడ్పాటు అందించాలని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని కోరామని చెప్పారు. ఇంటింటికీ రక్షిత మంచినీటిని అందించేందుకు ఉద్దేశించిన మిషన్ భగీరథకు రూ. 19,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేసిందని, ఈ బడ్జెట్‌లో ఆ నిధులు ఇవ్వాలని అడిగామన్నారు. మిషన్ కాకతీయకు రూ. 5,000 కోట్లు - కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 10,000 కోట్లు కోరామన్నారు.
విభజన సమయంలో ఇచ్చిన హామీల మేరకు గిరిజన విశ్వవిద్యాలయం - ఉద్యాన విశ్వవిద్యాలయం - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ - బయ్యారం ఉక్కు పరిశ్రమ - ఎయిమ్స్ ను మంజూరు చేయాలని అడిగినట్లు ఈటెల చెప్పారు. మిషన్ కాకతీయ. - మిషన్ భగీరథలకు సహకారం - శంకర్ పల్లి పవర్ ప్రాజెక్టుకు నేచరల్ గ్యాస్ - కరీంనగర్ కు గ్యాస్ - వరంగల్ కళాకేంద్రం - హైదరాబాదులో కళాభారతి కోరుతున్నారు. వెనుకబడిన 9 జిల్లాలకు రూ.450 కోట్లు - డబుల్ బెడ్ రూం ఇళ్లకు రూ.1596 కోట్లు - జాతీయ అకాడమీ - ఎకో టూరిజం - ఎనిమిది డ్రై పోర్టులు - హైదరాబాద్ ఫార్మా సిటీ తదితర హామీలు నెరవేరాయని ఆయన చెప్పారు. మరి ఈటెల విప్పిన చిట్టాలో ఉన్న అంశాల్లో వేటికి కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందో చూడాలి.