తిమ్మిని బమ్మిని చేయటంలో కేసీఆర్ తర్వాతే ఎవరైనా. ఆవేశాన్ని రగిలించాలన్నా.. అంత ఆవేశంలోనే ప్రేమను పుట్టించాలన్నా కేసీఆర్ మాటకు ఉండే శక్తి అంతా ఇంతా కాదు. తెలంగాణ ఉద్యమంలో సెటిలర్లు అన్న పదాన్ని.. సీమాంధ్రులు అన్న మాటను.. ఆ తర్వాతి కాలంలో ఆంధ్రోళ్లు అన్న మాటను తెర మీదకు తెచ్చింది.. అవసరానికి మించిన పాపులార్టీని తీసుకొచ్చింది ఎవరన్న ప్రశ్న వేస్తే.. వెనుకా ముందు చూసుకోకుండా అందరి వేళ్లు.. కేసీఆర్ వైపే చూపిస్తుంటాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాలుగున్నరేళ్ల తర్వాత కూడా.. హైదరాబాద్‌లోనూ.. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోనూ ఆంధ్రోళ్లు.. ఆంధ్రోళ్లు అన్న మాటను ఎక్కువగా ఉపయోగించేది టీఆర్ఎస్ కు చెందిన చోటామోటా నేతలే. అంతకాదా ఎందుకు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలు.. మంత్రులు.. ఎంపీలు.. ఇలా ఎవరి దగ్గరకు వెళ్లినా.. నోట్లో నుంచి మాట వచ్చినంతనే.. ఆంధ్రోడివా అన్న మాట చటుక్కున వచ్చేస్తుంది.
ఆంధ్రోడివా అంటారేంటి? హైదరాబాద్‌కు వచ్చి 40 ఏళ్లు అయ్యిందన్న మాట వస్తే.. అయితే..ఆంధ్రోడివి కావా? అన్న ప్రశ్నకు కేసీఆర్ అండ్ కో ఇప్పటివరకూ సరైన సమాధానం ఇచ్చింది లేదు. ఊరును వదిలేసి.. ఉన్న ఊరినే సొంతూరులా ఫీలయ్యే వారందరిని ఉద్దేశించి.. సెటిలర్లు అన్న మాటను తెర మీదకు తెచ్చిన కేసీఆర్.. ఈ రోజున ఆంధ్రోళ్లు అన్న మాట లేదు.. అందరూ తెలంగాణ వారే. ఆ మాటకు వస్తే.. ఆంధ్రా అన్న భావం వదిలేయండి.. యు ఆర్ ద మోస్ట్ రెస్పెక్టెడ్ తెలంగాణ సిటిజన్స్ అన్న తాజా మాట చూసినప్పుడు.. ఒక ఆలోచన కలుగక మానదు.
కేసీఆర్ కు నిజంగానే అంత గౌరవం ఉంటే.. ఆ వర్గానికి చెందిన వారికి టికెట్లు ఎందుకు ఇవ్వనట్లు? సరే.. టికెట్లను డిక్లేర్ చేశారు కాబట్టి ఆ విషయాన్ని వదిలేసి.. ఎమ్మెల్సీ కోటాలో మోస్ట్ రెస్పెక్టెడ్ తెలంగాణ సిటిజన్స్. వర్గానికి చెందిన ఒకరిని డిప్యూటీ సీఎం పదవిని ఇస్తారా? కలిసిపోండి.. కలిసిపోండని ఊత్తినే మాటలు చెబితే సరిపోతుందా? కలుపుకుపోవాలి కదా? కలవటానికి మోస్ట్ రెస్పెక్టెడ్ తెలంగాణ సిటిజన్స్. ఎన్నోఏళ్లుగా సిద్ధంగా ఉన్నారు. కానీ.. ఎప్పటికప్పుడు కూరలో కరివేపాకులా పక్కకు పెట్టేస్తున్నారు. మరీ రోజున మోస్ట్ రెస్పెక్టెడ్ తెలంగాణ సిటిజన్స్. అంటూ ప్రేమ పొంగిస్తున్న కేసీఆర్.. తన మాటలే కాదు చేతలు కూడా ఉంటాయని చెబుతూ.. తన తర్వాతి ప్రభుత్వంలో ఒకరిని డిప్యూటీ సీఎంను చేస్తానన్న మాట చెప్పే దమ్ము ఉందా? అన్న క్వశ్చన్ పలువురి నోటి నుంచి వస్తుంది. అయినా.. తెలంగాణ సమాజంలో మోస్ట్ రెస్పెక్టెడ్ తెలంగాణ సిటిజన్ కు ఆ మాత్రం ప్రయారిటీ ఇవ్వరా కేసీఆర్?