తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో మార్పులు చోటు చేసుకోనున్నాయన్న వాదన కొద్దిరోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కొందరికి పార్టీ పదవులు అప్పజెప్పి.. కొత్తగా మరికొందరిని క్యాబినెట్ లోకి తీసుకుంటారన్న ప్రచారం విస్తృతంగా సాగింది. అయితే.. అలాంటివేమీ ఉండవని.. కొద్ది మార్పులు మాత్రమే చోటు చేసుకోనున్నాయన్నది తాజా కబర్. మార్పులు చేర్పుల కంటే కూడా.. ముగ్గురు మంత్రుల వద్దనున్న శాఖల బదిలీలపైనే ముఖ్యమంత్రి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తు పూర్తి అయినట్లు చెబుతున్నారు.
పాలనా సౌలభ్యంతో పాటు.. తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని పూర్తి చేసే పనిలో భాగంగానే మంత్రివర్గంలో తాజా మార్పులని చెబుతున్నారు. విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం ప్రకారం.. వాణిజ్యపన్నుల శాఖా మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గరున్న శాఖను తెలంగాణ ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకోవాలని భావిస్తున్నారట. రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చి పెట్టే అవకాశం ఉన్న వాణిజ్య పన్నుల శాఖను తన వద్దే ఉంచుకోవటం ద్వారా.. పన్ను ఆదాయాన్ని మరింత పెంచుకునేందుకు వీలుగా వాణిజ్య పన్నుల శాఖను తన దగ్గర ఉంచుకోవాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం.
అదే సమయంలో ప్రస్తుతం వాణిజ్య పన్నుల శాఖను నిర్వహిస్తున్న తలసానికి ఆ శాఖకు బదులుగా బీసీ మంత్రిత్వ శాఖను అప్పగిస్తారని తెలుస్తోంది. ఇక.. కీలక శాఖలున్న కేటీఆర్ కు పరిశ్రమల శాఖను కూడా కట్టబెట్టాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పట్టణాభివృద్ధి.. ఐటీ శాఖల్ని సమర్థంగా నిర్వర్తిస్తున్న కేటీఆర్ కు కానీ పరిశ్రమల శాఖను ఇవ్వటం ద్వారా.. అన్ని ఒకేచోట ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆయన దగ్గరున్న పంచాయితీరాజ్.. గ్రామీణాభివృద్ధి శాఖను ఇప్పటివరకూ పరిశ్రమల శాఖను నిర్వర్తిస్తున్న మంత్రి జూపల్లికి కేటీఆర్ దగ్గరున్న గ్రామీణాభివృద్ధి.. పంచాయితీరాజ్ శాఖల్ని బదిలీ చేసే వీలుందని చెబుతున్నారు. తాజాగా చేస్తున్న మార్పులకు సంబంధించిన అధికారిక ప్రకటన ఒకట్రెండు రోజుల్లో వెలువడుతుందని తెలుస్తోంది.