డ‌బుల్ బెడ్రూంల్లో కేసీఆర్ ముద్ర‌

Update: 2016-01-06 05:16 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిర్ణ‌యాలు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఉంటాయ‌నేందుకు ఉదాహ‌ర‌ణ డ‌బుల్ బెడ్రూం ఇళ్లు. పేదల ఇళ్లంటే ఒకపుడు పిచ్చుక గూళ్లు..కానీ స్వరాష్ట్రం - స్వపరిపాలనలో సర్కారు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తుంది అంటూ కేసీఆర్ ప్ర‌క‌టించారు. న‌గ‌రంలోని ఐడీహెచ్ కాల‌నీలో ఒక్క‌చోటే నిర్మించిన‌ప్ప‌టికీ ఆ ఇళ్లు తెలంగాణ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యాయి. ప్ర‌భుత్వం ఇంకా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌న‌ప్ప‌టికీ వేల‌కొద్ది క‌లెక్ట‌ర్ కార్యాల‌యాల‌కు వ‌స్తున్న ద‌ర‌ఖాస్తులే ఇందుకు నిద‌ర్శ‌నం. తాజాగా డ‌బుల్ బెడ్రూం ఇళ్ల విష‌యంలో కేసీఆర్ మ‌రో కీల‌క అడుగు వేసి త‌న‌దైన ముద్ర వేసేందుకు సిద్ధ‌ప‌డ్డారు.

ఎక్కువ మంది లబ్దిదారులకు ఈ ఇళ్లను అందించేందుకు మ‌రో ఏడు చోట్ల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి టెండ‌ర్లు పిలిచారు. సనత్‌ నగర్ - యాకుత్‌ పురా - మలక్‌ పేట - అంబర్‌ పేట - ముషీరాబాద్ - ఖైరతాబాద్ - దోభీఘాట్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోక్క ప్రాంతాన్ని ఎంపిక చేసి తొమ్మిది అంతస్తుల భనవాలను నిర్మించనున్నారు. ఇందులో అస‌లు విశేషం ఏంటంటే ఈ డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌లో లిఫ్టులు కూడా ఉండ‌నున్నాయి. ఈ ఏడుచోట్లా లిఫ్టులు సమకూర్చేందుకు జీహెచ్‌ ఎంసి అధికారులు రూ. 151 కోట్లు మంజూరు చేశారు. ఈ ఇళ్ల నిర్మాణానికి అధికారులు ఈనెల 11వ తేదీ నుంచి టెండర్ల ప్రక్రియను చేపట్టి వివిధ రకాల టెండర్ల ప్రక్రియలను వచ్చే నెల 4వ తేదీ వరకు ముగించి, ఆ తర్వాత పనులు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

నిజంగా పిచ్చుక గూళ్ల లాంటి ఇళ్ల‌ల్లో మగ్గుతున్న పేద‌లు డ‌బుల్ బెడ్రూం ఇళ్ల‌లో సౌక‌ర్య‌వంతంగా ఉండ‌ట‌మే కాకుండా...అందులో సంప‌న్నుల నివాసం వంటి లిఫ్ట్ సౌక‌ర్యం కూడా క‌లిగి ఉంటే తెలంగాణ ముఖ్య‌మంత్రిని మ‌రిచిపోగ‌ల‌రా? అదే కేసీఆర్‌ కు కావాల్సింది కూడా
Tags:    

Similar News