ఏం చేసినా బహిరంగంగా చేయాలి. తప్పు ఎంత పెద్దదైనా సరే.. బాహాటంగా చేస్తే ఆ కిక్కే వేరబ్బా అన్న చందంగా మారింది మునుగోడులోని టీఆర్ఎస్ పార్టీ తీరు. ప్రత్యర్థి పార్టీల తీరుపై నిత్యం విరుచుకుపడే కేసీఆర్ అండ్ కో.. తాము మాత్రం అన్నింటికి అతీతం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.
తాము చేస్తే ఒప్పు.. అదే పని ఇతరులు చేస్తే తప్పు అని వేలెత్తి చూపించే అలవాటున్న గులాబీ నేతలకు.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తే.. బరితెగింపు అయినా బాజాప్తగా చేయాలన్న రీతిలో వ్యవహరించే గులాబీ నేతల పుణ్యమా అని.. ఇప్పుడు అందరికి అర్థమయ్యే పరిస్థితి.
మునుగోడు ఉప పోరు ఎన్నికల ప్రచారానికి గడువు గంటల్లోకి వచ్చేసిన వేళ.. సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం చుండూరులో భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు మస్తు మంది జనాల్ని తోలుకు వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న సీన్ ఒకటి సోషల్ మీడియాలో పోస్టుగా మారటంతో ఇప్పుడు ఆ వీడియో మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. సాధారణంగా ముఖ్యమంత్రి.. ప్రముఖ నేతలు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసే సభ కోసం వచ్చే వారిలో చాలామంది డబ్బులకు ఆశపడి వస్తుంటారు.
ఇంతవరకు ఓకే కానీ.. బహిరంగంగా ఊళ్లో దండోరా వేయించి మరీ.. సభకు వచ్చినోళ్లకు రూ.500 అంటూ ప్రచారం చేయటం మాత్రం కేసీఆర్ అండ్ కోకు మాత్రమే చెల్లిందనుకోవాలి. చుండూరులో జరిగే సభకు హాజరయ్యే వారికి అద్భుత ఆఫర్ అంటూ.. చెర్లగూడెంలో దండోరా వేసి మరీ చాటింపు వేశారు. "ఇయ్యాళ్లా చెర్లగూడెంల సీఎం కేసీఆర్ సార్ సభ ఉందుళ్లో.. ఈ మీటింగ్‌కు అందరూ రావాళుల్లో.. వచ్చినోళ్లందరికి మనిషికి 500 ఇత్తారుళ్లో" అంటూ డప్పు కొట్టిన సీన్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ప్రతిష్ఠాత్మకంగా సాగే ఉప ఎన్నికల వేళ రాజకీయ పార్టీల బరితెగింపు మామూలే అయినా.. మరీ ఇంత ఇదిగా బాజాప్త అన్న రీతిలో వ్యవహరిస్తున్న వైనం మాత్రం ఇప్పుడు అందరిని అవాక్కు అయ్యేలా చేస్తున్నారు.
అందరూ భావిస్తున్నట్లుగా అధికార టీఆర్ఎస్ కు చెందిన నేతలు ఇలా చేశారా? లేదంటే.. వారిని ఇక్కట్లపాలు పడేలా చేయటం కోసం ప్రత్యర్థి పార్టీలు కాస్తంత భిన్నంగా ప్లాన్ చేశాయా? అన్నదిప్పుడు తేలాల్సి ఉంది. అప్పటివరకు మాత్రం అధికార పార్టీనే బద్నాం అవుతుందన్నది మాత్రం వాస్తవం. మరి.. టీఆర్ఎస్ నేతలు ఈ వీడియోపై క్లారిటీ ఇస్తారో? లేదో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
Full View Full View
తాము చేస్తే ఒప్పు.. అదే పని ఇతరులు చేస్తే తప్పు అని వేలెత్తి చూపించే అలవాటున్న గులాబీ నేతలకు.. తాజాగా వైరల్ అవుతున్న వీడియోను చూస్తే.. బరితెగింపు అయినా బాజాప్తగా చేయాలన్న రీతిలో వ్యవహరించే గులాబీ నేతల పుణ్యమా అని.. ఇప్పుడు అందరికి అర్థమయ్యే పరిస్థితి.
మునుగోడు ఉప పోరు ఎన్నికల ప్రచారానికి గడువు గంటల్లోకి వచ్చేసిన వేళ.. సీఎం కేసీఆర్ ఆదివారం సాయంత్రం చుండూరులో భారీ బహిరంగ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు మస్తు మంది జనాల్ని తోలుకు వచ్చిన సందర్భంగా చోటు చేసుకున్న సీన్ ఒకటి సోషల్ మీడియాలో పోస్టుగా మారటంతో ఇప్పుడు ఆ వీడియో మీద జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. సాధారణంగా ముఖ్యమంత్రి.. ప్రముఖ నేతలు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసే సభ కోసం వచ్చే వారిలో చాలామంది డబ్బులకు ఆశపడి వస్తుంటారు.
ఇంతవరకు ఓకే కానీ.. బహిరంగంగా ఊళ్లో దండోరా వేయించి మరీ.. సభకు వచ్చినోళ్లకు రూ.500 అంటూ ప్రచారం చేయటం మాత్రం కేసీఆర్ అండ్ కోకు మాత్రమే చెల్లిందనుకోవాలి. చుండూరులో జరిగే సభకు హాజరయ్యే వారికి అద్భుత ఆఫర్ అంటూ.. చెర్లగూడెంలో దండోరా వేసి మరీ చాటింపు వేశారు. "ఇయ్యాళ్లా చెర్లగూడెంల సీఎం కేసీఆర్ సార్ సభ ఉందుళ్లో.. ఈ మీటింగ్‌కు అందరూ రావాళుల్లో.. వచ్చినోళ్లందరికి మనిషికి 500 ఇత్తారుళ్లో" అంటూ డప్పు కొట్టిన సీన్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ప్రతిష్ఠాత్మకంగా సాగే ఉప ఎన్నికల వేళ రాజకీయ పార్టీల బరితెగింపు మామూలే అయినా.. మరీ ఇంత ఇదిగా బాజాప్త అన్న రీతిలో వ్యవహరిస్తున్న వైనం మాత్రం ఇప్పుడు అందరిని అవాక్కు అయ్యేలా చేస్తున్నారు.
అందరూ భావిస్తున్నట్లుగా అధికార టీఆర్ఎస్ కు చెందిన నేతలు ఇలా చేశారా? లేదంటే.. వారిని ఇక్కట్లపాలు పడేలా చేయటం కోసం ప్రత్యర్థి పార్టీలు కాస్తంత భిన్నంగా ప్లాన్ చేశాయా? అన్నదిప్పుడు తేలాల్సి ఉంది. అప్పటివరకు మాత్రం అధికార పార్టీనే బద్నాం అవుతుందన్నది మాత్రం వాస్తవం. మరి.. టీఆర్ఎస్ నేతలు ఈ వీడియోపై క్లారిటీ ఇస్తారో? లేదో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.