ఒక్కో నేతకు ఒక్కో స్టైల్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నే తీసుకుంటే.. ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరు. మిగిలిన ముఖ్యమంత్రులకు భిన్నంగా మంత్రులకు సైతం ఆయన టైం ఇవ్వరు. తనకు తోచినప్పుడు.. నచ్చినప్పుడు ఫోన్ చేస్తారు.. లేదంటే తన దగ్గరకు పిలుచుకుంటారు. మిగిలిన సీఎంల మాదిరి మంత్రులకు అందుబాటులో ఉండటం కేసీఆర్ కు అస్సలు ఇష్టం ఉండదంటారు.
ఇదే కాదు.. తనకు నచ్చని నేతల్ని దూరంగా పెట్టటం.. వారికివ్వాల్సిన ప్రాధాన్యతను పూర్తిగా బంద్ చేసి.. రాజకీయంగా వారికి ఎలాంటి పలుకుబడి లేని రీతిలో చేసి వదిలేస్తుంటారు. నేత ఎవరైనా ఒక్కసారి తేడా వస్తే.. వారిని పూర్తిగా పక్కన పెట్టేస్తారన్న మాట ఉంది. అలాంటి కేసీఆర్ కు.. టీఆర్ఎస్ లో సీనియర్ నేత.. ఉద్యమంలో గులాబీ బాస్ కు వెన్నంటే నిలిచిన ఈటల రాజేందర్ కు మధ్య గ్యాప్ వచ్చిందన్న వాదనపై భారీ చర్చే జరిగింది. సోషల్ మీడియాలో దీనిపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు.
గులాబీ పార్టీకి ఓనర్లం మేమేనంటూ ఈటల చేసిన వ్యాఖ్య గులాబీ పార్టీలో క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంతా కాదు. పార్టీ హద్దుల్ని ఈటల పూర్తిగా దాటేశారని.. ఆయనపై చర్యలు తప్పవన్న మాటతో పాటు.. మంత్రి పదవి పోవటం పక్కా అన్న అంచనాలు వినిపించాయి.
దీనికి విరుద్ధంగా ఆయన పదవి నిక్షేపంగా ఉండటమే కాదు.. కేబినెట్ విస్తరణ వేళలో.. స్వయంగా ఫోన్ చేసి ఈటలను ప్రగతిభవన్ పిలిపించుకున్నారు. దీంతో.. కేసీఆర్.. ఈటల మధ్య పెరిగిన దూరం తగ్గినట్లుగా చెబుతారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరోసారి ఈటలకు కేసీఆర్ ఫోన్ చేయటం ఆసక్తికరంగా మారింది.
ఎంతో ప్రాధాన్యత ఇస్తే తప్పించి..వారంలో రెండుసార్లు ఒక మంత్రికి మీడియాకు తెలిసేలా ఫోన్ చేయటం ఉండదు. తాజా ఫోన్ కాల్ సారాంశం చూస్తే.. కష్టం వచ్చినప్పుడే సమర్థంగా పని చేయాలని.. వెనకడుగు వేయకూడదన్న ఊరడింపు.. రాష్ట్రంలో విష జ్వరాల విషయంలో మరింత చురుగ్గా పని చేయాలన్న దన్ను మాట కేసీఆర్ నోటి నుంచి వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రతికూల పరిస్థితులు ఎదురైప్పుడు ప్రజలకు మరింత అందుబాటులో ఉండాలని.. అన్ని రకాల మందుల్ని అందుబాటులో ఉంచుకోవాలని.. కొరత రానివ్వకుండా చూసుకోవాలన్నారు. సుమారు 20 నిమిషాల పాటు సాగిన వీరి ఫోన్ సంభాషణ ఇప్పుడు కొత్త చర్చకు తెర తీసింది.
వైద్య ఆరోగ్య శాఖను ఈటల నుంచి తీసేసుకొని వేరే వారికి ఇస్తారన్న ప్రచారానికి భిన్నంగా.. మద్దతుగా మాట్లాడటం.. నీ వెనుక నేనున్నా.. నేను చూసుకుంటానన్న సందేశాన్ని ఇచ్చేలా కేసీఆర్ ఫోన్ కాల్ ఉందంటున్నారు. ఏది ఏమైనా.. రోటీన్ కు భిన్నంగా కేసీఆర్ తీరు ఉందన్న మాట వినిపిస్తోంది. మరికొందరైతే.. ఏంది బాసూ.. కేసీఆర్ లో ఇంత మార్పా? అన్న ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలివైన అధినేత ఎప్పుడూ అర్థం కానట్లుగా ఎత్తులు వేయటం రాజకీయాల్లో మామూలేగా?