దేశాన్ని ఏలుతున్న భారతీయ జనతా పార్టీ మొత్తం ఇప్పుడు తెలంగాణకు.. హైదరాబాద్ కు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఈసారి హైదరాబాద్ లో నిర్వహించటం ద్వారా.. పార్టీకి మరింత ఊపును.. ఉత్సాహాన్ని ఇవ్వటంతో పాటు.. పార్టీకి తెలంగాణ ఎంత ముఖ్యమన్న విషయాన్ని చెప్పటమే లక్ష్యమని చెబుతున్నారు. జాతీయ నాయకత్వం మొత్తం తరలిరావటం.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల పాటు హైదరాబాద్ లో బస చేయటం లాంటి వాటితో కమలనాథులు మహా ఉత్సాహంగా ఉన్నారు.
తన రాజకీయ ప్రత్యర్థులు మహా దూకుడును ప్రదర్శిస్తున్న వేళలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కామ్ గా ఎందుకు ఉంటారు? తన సత్తా చాటటమే కాదు.. మోడీకి తాను ఏ మాత్రం తీసిపోనన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసేందుకు ఆయన తనదైన శైలిలో ఏర్పాట్లు చేస్తున్నారు. తాము టార్గెట్ చేసిన రాష్ట్రం ఏదైనా సరే.. తమదైన రీతిలో పావులు కదిపే అలవాటున్న కమలనాథులకు.. దిమ్మ తిరిగే షాకులు ఇచ్చేందుకు వీలుగా గులాబీ బాస్ ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన నలుగురు బీజేపీ కార్పొరేటర్లను టీఆర్ఎస్ లోకి చేర్చటం ద్వారా.. ఆ పార్టీకి ఝులక్ ఇచ్చారని చెబుతున్నారు. వాస్తవానికి మొత్తం పది మంది వరకు కార్పొరేటర్లతో సంప్రదింపులు జరపగా.. ఆరుగురు సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నారు.
అయితే.. ఈ ఆరుగురు కార్పొరేటర్లు గులాబీ కండువాలు వేసుకోవటానికి సిద్ధమైనప్పటికీ.. చివర్లో ఇద్దరు వెనకడుగు వేశారని చెబుతున్నారు. దీంతో.. నలుగురిని గులాబీ కారు ఎక్కిస్తున్న వైనాన్ని వెల్లడించారు. అయితే.. ఇక్కడే మరో వాదన కూడా వినిపిస్తోంది.
పార్టీ మారేందుకు ముందుకు వచ్చిన ఆరుగురిని ఒకేసారి కాకుండా.. రెండు దఫాలుగా చేర్చుకోవటం ద్వారా.. బీజేపీకి వరుస షాకులు ఇచ్చే ఏర్పాటు జరిగిందని చెబుతున్నారు. ఇందులో భాగంగా మొదటి ఎపిసోడ్ ను విజయవంతంగా పూర్తి చేశారని.. రెండో ఎపిసోడ్ రానున్న రెండు రోజుల్లో ఖాయమంటున్నారు.
ఇదే కాకుండా మరిన్ని షాకులు ఇచ్చేందుకు వీలుగా గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ప్లాన్ చేసినట్లుగా చెబుతున్నారు. చూస్తుంటే.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ ఫుల్ గా నిర్వహించామన్న సంతోషాన్ని లేకుండా చేయటమే కేసీఆర్ అసలు లక్ష్యమన్న మాట వినిపిస్తోంది. మరి.. దీనికి మోడీ అండ్ కో ఎలాంటి బదులిస్తారో చూడాలి.