తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ చరిత్రలో తొలిసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సమగ్ర జల విధానంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. గూగుల్ ఎర్తు సాయంతో దాదాపు మూడున్నర గంటల పాటు తెలంగాణ జల విధానాన్ని ఆయన వివరించనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఒకటి స్పీకర్ ముందు, రెండోది అధికారపక్ష సభ్యుల ముందు, మూడో స్క్రీన్ ను విపక్ష సభ్యుల ముందు ఏర్పాటు చేశారు.
శాసనమండలిలో సభ్యుల కోసం మరో స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు విభాగాలుగా ఈ ప్రజెంటేషన్ కార్యక్రమం ఉంటుంది. మొత్తం 108 పవర్ పాయింట్ స్లైట్లు ఇందులో ఉంటాయి. జిల్లాల వారీగా ప్రాజెక్టులు - తాగునీటికి ఉన్న అవకాశాలను వివరిస్తారు. కాగా, ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అసెంబ్లీ చరిత్రలోనే మొట్టమొదటిసారి అవుతుంది. ఏరియల్ షాట్సును చూపిస్తూ సమగ్ర వివరాలతో సభ్యులకు ఆయన వివరిస్తారు. ముఖ్యంగా 60 ఏళ్ల కాలం... అంటే, 1956 నుంచి 2016 వరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ కోసం కట్టిన ప్రాజెక్టులెన్ని, ఎన్ని టీఎంసీల నీరు వినియోగించేలా వాటిని కట్టారు వంటి వివరాలను ఆయన సభకు సమర్పిస్తారు. మహారాష్ట్ర, గోదావరి నదీ జలాలను వినియోగించుకుంటున్న ఇతర రాష్ట్రాల్లో ఎన్ని వందల ప్రాజెక్టులు కట్టారు.. తెలంగాణలో ఎందుకు కట్టలేకపోయారనే విషయాలు వివరిస్తారు. దీనికోసం కేబినెట్ సహచరులు - ఇరిగేషన్ నిపుణులతో కేసీఆర్ దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు.