తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓట్ల రాజకీయానికి మరింత పదునుపెడుతున్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుండటంతో బీసీ ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. టీఆర్ ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో వృత్తిదారుల ఫెడరేషన్లకు బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నప్పటికీ వాటిని విడుదల చేయటం లేదు. ఆయా ఫెడరేషన్లకు 2018-19 వార్షిక బడ్జెట్ లో కేటాయించిన నిధులను రూ. 125 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఫెడరేషన్లతో పాటు చేనేత - బీసీ స్టడీ సర్కిల్స్ - హాస్టళ్ల నిర్వహణ - బీసీ కార్పొరేషన్ కు మరో రూ.200 కోట్లు విడుదల చేసింది. ముందస్తు ఎన్నికల ప్రభావంతో ఎట్టకేలకు ఫెడరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం గమనార్హం.
ప్రగతిభవన్ లో శుక్రవారం వివిధ అంశాలపై మంత్రులు - ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలు - ఎంబీసీల స్వయం ఉపాధికోసం రూపొందించే పథకాల విషయంలో క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ప్రకారం ముందుకుపోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. బ్యాంకులతో సంబంధం లేకుండానే లక్ష - రెండు లక్షల రూపాయల విలువచేసే యూనిట్లను మంజూరుచేయాలని - దీనికి 100% ప్రభుత్వ గ్రాంట్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. బీసీలు - ఎంబీసీలకు పథకాల అమలుపై అవసరమైన వ్యూహం ఖరారుకు శనివారం ఉదయం స్పీకర్ మధుసూదనాచారి సమక్షంలో సమావేశం కావాలని మంత్రులు - అధికారులను సీఎం ఆదేశించారు.
ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రారంభించిన ఎస్సీ - ఎస్టీ - బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు అద్భుతమైన ఫలితాలనిస్తున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ప్రతి మండలానికి ఒక రెసిడెన్షియల్ స్కూలు పెట్టే లక్ష్యం ప్రభుత్వానికి ఉందన్నారు. అందులో భాగంగా దశలవారీగా రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య పెంచుతామని తెలిపారు. వచ్చే ఏడాదినుంచి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున కొత్తగా 119 రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించాలని ఆదేశించారు. హుటాహుటిన మీద ఈ ఆదేశాలు ఇచ్చేందుకు ఎన్నికల సీజన్ కారణమని చర్చలు జరుగుతున్నాయి.