ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సంచలన కామెంట్

Update: 2019-10-24 12:11 GMT
తెలంగాణలోని ఏకైక ఎన్నిక హుజూర్ నగర్ లో గెలుపును కేసీఆర్ సెలెబ్రేట్ చేసుకున్నారు.  ఈ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మీడియా ముందుకు వచ్చారు..  ఆర్టీసీ పని అయిపోయిందని.. దీన్ని ఎవ్వడూ కాపాడలేరని కేసీఆర్ హాట్ కామెంట్ చేశారు. ఆర్టీసీ మునిగిపోయేది కాదని.. కార్మిక నాయకులే ముంచుతున్నారని సంచలన కామెంట్ చేశారు. ఆర్టీసీ యూనియన్ల ఎన్నికలు రావడంతో వారంతా సమ్మెకు దిగి క్రెడిట్ పెంచుకోవడానికే ఈ సమ్మె డ్రామాలు ఆడుతున్నారని యూనియన్ ఎన్నికల కోసమే ఈ సమ్మెలని తెలిపారు.

ఆర్టీసీ మునిగిపోయిందని ఎవ్వరూ కాపాడలేని అప్పులు పెరిగిపోయాయన్నారు. 5000 కోట్ల అప్పులు  పెరిగిపోయాయని.. ఐదేళ్లలో 700 కోట్లు ప్రభుత్వం చెల్లించామన్నారు. ఇక జీహెచ్ఎంసీని కూడా హైదరాబాద్ లో బస్సుల నిర్వహణ ఖర్చును భరించేలా నిర్ణయించామని కేసీఆర్ తెలిపారు.

ఆర్టీసీ యూనియన్లు పనికిమాలిన 10 డిమాండ్లు పెట్టారని..  ఆర్టీసీ వాళ్లకు బుద్ది జ్ఞానం లేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో ఆర్టీసీ కలుపడం సాధ్యం కాదని కేసీఆర్ తేల్చారు. ప్రైవేటు అద్దె బస్సులు లాభాలు తెస్తుంటే.. ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు నష్టాల బాట పట్టడానికి కారణం ఏంటని కేసీఆర్ ప్రశ్నించారు. సంవత్సరానికి 900 కోట్లు సాయం చేసినా ఆర్టీసీ బాగుపడలేదని అన్నారు. ఇంత సాయం చేసినా బాగుపడకపోతే ఏమీ చేయలేమన్నారు. గొంతెమ్మ కోర్కెలు తీర్చడం ఎవ్వరి వల్ల కాలేదన్నారు. ఆర్టీసీ దివాళా తీసిందన్నారు.

ఆర్టీసీలో డబ్బులు లేవని.. డబ్బులు రావని కేసీఆర్ అన్నారు. ఆర్టీసీ యూనియన్లు సంస్థను ముంచుతున్నాయని.. ఆర్టీసీ కార్మికుల గొంతు కోస్తున్నారని కేసీఆర్ సీరియస్ కామెంట్ చేశారు.
Tags:    

Similar News