టీఆర్ఎస్ నుంచి కొత్త డిమాండ్ వచ్చింది. ఓ మంత్రి మనసులోని మాట బయటకొచ్చింది. ‘తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకసారి దేశానికి ప్రధాని కావాలి’ అని డిమాండ్ వినిపించింది.
తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి ఈ మేరకు తన ఆకాంక్షను బయటపెట్టాడు. కేసీఆర్ ప్రధానమంత్రి అయితే ప్రజలకు సమస్యలే ఉండవని చెప్పుకొచ్చారు. జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్న వారు చిన్నప్పటి నుంచి అవే పథకాలు రన్ చేస్తున్నారని.. ఏదో మభ్యపెట్టి కాలం గడుపుతున్నారని మల్లారెడ్డి పేర్కొన్నారు.
70 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందని మల్లారెడ్డి ప్రశ్నించారు. ఏడు సంవత్సరాల్లోనే కేసీఆర్ తెలంగాణలో చరిత్ర సృష్టించాడని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వైద్యం అందించిన వ్యక్తం కేసీఆర్ అని ప్రశంసించారు.
దేశం చూపు తెలంగాణ వైపు ఉందని.. అందుకే కేసీఆర్ ను పీఎంను చేయాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ఒక్కసారి పీఎం అయితే అన్ని రాష్ట్రాల్లో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆయన పేర్కొన్నారు. తన శాఖ పద్దు చిన్నదని.. సభ్యులంతా ఆమోదించాలని కోరడంతో సభలో మంత్రులు హరీష్, కేటీఆర్ సహా అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. మొత్తానికి తన ప్రసంగంతో మంత్రి మల్లారెడ్డి అసెంబ్లీలో నవ్వులు పూయించారు.