తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటేనే దూకుడుకు మారుపేరు. అయితే చిత్రంగా కేసీఆర్ మొదలుపెట్టి - పట్టుబట్టి చేపట్టిన కార్యంలో ఆయనకంటే వేగంగా ప్రతిపక్షాలు దూసుకు వెళ్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ దూకుడుగా ముందుకు సాగినప్పటికీ టీఆర్ ఎస్ జిల్లా కమిటీల ఏర్పాటుపై మాత్రం మల్ల గుల్లాలు పడుతోంది. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ విషయంలో ముందుండటమే కాదు ఏకంగా ప్రక్రియ పూర్తిచేయడం గమనార్హం. కీలక విపక్షమైన టీడీపీ - బొటాబొటి క్యాడర్ తో ముందుకు సాగుతున్న వామపక్షాలు సైతం కమిటీని నియమించగా గులాబీ దళపతి కేసీఆర్ మాత్రం ఇంకా నాన్చివేత దోరణిలో ఉన్నారు.
కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ఉత్సాహంగా ముందుకు వెళ్లగా - కొత్త జిల్లాలకు కొత్త కమిటీలను ఏర్పాటు చేయడంలో విపక్షాలు ముందున్నాయి. వామపక్షాలు కొత్త జిల్లాలకు కొత్త కమిటీలను అందరి కన్నా ముందు నియమించాయి. టీడీపీ తొలుత హడ్ హక్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అడ్ హక్ కమిటీల ఏర్పాటుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుమతి తీసుకున్నారు. తొలుత హడ్ హక్ కమిటీలు ఏర్పాటు చేసి తరువాత పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఇక అధికార పక్షం మాత్రం గత వారం రోజుల నుంచి జిల్లా కమిటీల ఏర్పాటు ఎప్పటికప్పుడు నేడో రేపో అని చెబుతోంది. పేర్లు ఖరారు అయినప్పటికీ ప్రకటించలేదు. ఈ కమిటీలను సోమవారం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంటున్నారు. అభిప్రాయ సేకరణ - జాబితా రూపకల్పన అన్నీ ముగిసిపోయినందున సోమవారం ప్రకటించేందుకు ఇబ్బంది ఏమీ ఉండదని పార్టీ నాయకులు చెబుతున్నారు. పాత జిల్లాలు పది - కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలు 21 మొత్తం 31 జిల్లాలకు కూడా కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తారు. గతంలోని పాత జిల్లాల కమిటీల్లోని పలువురికి రాష్ట్ర కమిటీలో స్థానం కల్పించనున్నారు. అదే విధంగా జిల్లా కమిటీల్లోని పలువురు సభ్యులు కొత్తగా ఏర్పడిన వేరు వేరు జిల్లాల పరిధిలోకి వెళతారు కాబట్టి మొత్తం 31 జిల్లాలకు కొత్తకమిటీలు వేస్తారని పార్టీ నాయకులు అంటున్నారు.
ఇదిలాఉండగా టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కమిటీల నియామకంపై కొత్త చర్చ జరుగుతోంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడాన్ని పలువురు టీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్యేల జోక్యాన్ని కూడా సహించలేకపోతున్నారు. దీంతో కొన్నిచోట్ల అధ్యక్షుల నియామకం కొలిక్కిరాలేదు. 31 జిల్లాలకు గాను 18 జిల్లాల నియామకం సాఫీగా జరిగినా మిగతా జిల్లాల కమిటీలపై చర్చోపచర్చలు జరుగుతున్నట్టు తెలిసింది. అదే సమయంలో జిల్లా అధ్యక్షులతో పాటు కమిటీలు, రాష్ట్ర కమిటీ, అనుబంధ సంఘాలను ఒకేసారి ప్రకటించడం వలన అసంతృప్తులు లేకుండా చేయొచ్చనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనగా ఉంది. కేసీఆర్ మీడియా సమావేశంలో స్వయంగా కొత్త కమిటీని ప్రకటిస్తారని సమాచారం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/