బీజేపీకి మ‌తం - కూట‌మికి కులం..కేసీఆర్ పంచ్‌!

Update: 2018-11-19 11:46 GMT
చంద్ర‌బాబుకు కేసీఆర్‌కు ఒక స్ప‌ష్ట‌మైన తేడా ఉంది. చంద్ర‌బాబు ప్ర‌పంచాన్ని గెల‌వాల‌నుకుంటాడు. కేసీఆర్ ముందు ఇల్లు గెల‌వాల‌నుకుంటాడు. పెద్ద‌లు ఊరికే అన‌లేదు ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వ‌మ‌ని. ఆ విష‌యం ఫాలో అవ‌ని చంద్ర‌బాబు ప్ర‌పంచ‌మంతా పేరుపొందాల‌న్న దురాశ చివ‌ర‌కు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవాల్సిన దుస్థితిని తెచ్చిపెట్టింది. ఒక పార్టీ దేనికి వ్య‌తిరేకంగా పుట్టిందో దాంతోనే క‌ల‌వాల్సి రావ‌డం ప‌త‌న‌మే క‌దా. ఇపుడు బాబుది అదే ప‌త‌నం.

నామినేష‌న్ల ఘ‌ట్టం ఒక‌వైపు ముగియ‌డంతో కేసీఆర్ స‌భ‌లు మొద‌ల‌య్యాయి. ఖ‌మ్మం నుంచి కేసీఆర్ ప్ర‌చారం మొద‌లుపెట్టారు. మ్మంలోని పాలేరులో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప్ర‌చారం ప్రారంభించారు. ఖమ్మం జిల్లాలో ఈసారి టీఆర్ ఎస్ మొత్తం ప‌దికి పది స్థానాలు గెలుస్తుంద‌న్నారు. ఖ‌మ్మం నుంచి ఎందుకు ప్ర‌చారం మొద‌లుపెట్టార‌ని అనే ప్ర‌శ్న ఉత్ప‌న్నం కాక‌ముందే నిష్టూర‌మైన నిజం మాట్లాడుకుందాం అని ఆయ‌న దానికి స‌మాధానం చెప్పేశారు.

‘2014 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ నేతలతో ఉత్తర తెలంగాణ పుణ్యాన మనం అధికారంలోకి వస్తాం. అయితే ఖమ్మం, హైదరాబాద్ ను పరిగణనలోకి తీసుకోకుండా పోరాడాల్సి ఉంటుంది’ అని తాను చెప్పానని* కేసీఆర్ వెల్లడించారు. అయితే, ఈ సారి త‌న ఎన్నికల ప్రచారాన్ని ఖమ్మం నుంచే ప్రారంభించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన‌ట్లు చెప్పారు.  

ఈ సంద‌ర్భంగా మ‌త రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీ ఉద్దేశించి, కులాల‌ను రెచ్చ‌గొడుతున్న ఇత‌ర పార్టీల‌ను ఉద్దేశించి కేసీఆర్ ఒక మంచి వ్యాఖ్య చేశారు. ప్రజలు కులం, మతం ఆధారంగా కాకుండా వాస్తవాల ఆధారంగా ఓటు వేయాలి.  వాటి ఆధారంగా ఎవ‌రూ బాగుప‌డిన దాఖ‌లాల్లేవు. కులాలు, మతాలు ఎవ్వరికీ అన్నం పెట్టవు. ఫలానా కులం వ్యక్తి సీఎం కాగానే ఆ కులంలో పేదరికం పోతుందా?  అలా జ‌ర‌గ‌దు. మ‌రి రాజ‌కీయాల్లోకి అవెందుకు వ‌స్తాయి? అని ప్ర‌శ్నించారు. కులం, మతం పేరుతో ఎవ‌రైనా ఓట్లు అడిగితే చెంప మీద లాగి ఒక‌టివ్వ‌మ‌ని చెప్పారు.

ఇక మ‌హాకూట‌మి నేత‌ల‌పై కేసీఆర్ సెటైర్లు వేశారు. అధికారం కోల్పోయిన మూడేళ్లకే కాంగ్రెస్ నేతలకు చుక్క‌లు క‌నిపించాయి. చేతిలో డ‌బ్బాడ‌టం లేద‌ట‌. అందుకే మిమ్మ‌ల్ని న‌మ్మించ‌డానికి ఆరు చందమామలు, ఏడు సూర్యుళ్లను తెస్తామని చెబుతున్నారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో మహానుభావాలు, అంతర్జాతీయ మేధావులు ఉన్నారని... తెలంగాణ‌కు ప‌నికొచ్చేవాళ్లు లేర‌ని అన్నారు. విద్యుత్ ను 9 గంటలు కూడా ఇవ్వలేని కాంగ్రెస్, టీడీపీ నేతల మేధావితనం ఏడ దాక్కుంద‌ని ప్ర‌శ్నించారు.


Tags:    

Similar News