కేసీఆర్ విజ‌య‌వాడ టూర్‌ తో బాబు షాక్‌

Update: 2015-12-14 15:29 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు - ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడుల అపూర్వ క‌ల‌యిక‌కు న‌వ్యాంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని విజ‌య‌వాడ వేదికైంది. మ‌రో ప‌దిరోజుల్లో తాను నిర్వ‌హించ‌నున్న ఆయుత చండీయాగానికి ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడును ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ విజ‌య‌వాడ‌కు వెళ్లారు. ఉండ‌వ‌ల్లిలోని చంద్ర‌బాబు నివాసానికి కేసీఆర్ వెళ్లగా... బాబు సాద‌రంగా ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు చంద్ర‌బాబుకు పూల గుచ్చం ఇచ్చి త‌న నివాసంలోకి సాద‌రంగా ఆహ్వానించారు. చండీయాగానికి హాజ‌రుకావాల్సిందిగా కోరుతూ చంద్ర‌బాబుకు ఆహ్వాన ప‌త్రిక అంద‌జేశారు. బాబు స్వీక‌రించారు. ఇద్ద‌రు క‌లిసి మ‌ధ్యాహ్న భోజ‌నం చేశారు.అనంత‌రం కేసీఆర్ తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చేశారు.

ఇదంతా బాగానే ఉన్నా....కేసీఆర్ విజ‌య‌వాడ‌ టూర్ ఆయ‌న తాజా ఎత్తుగ‌డ‌కు నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్తున్నారు. స‌రిగ్గా రెండ్రోజులు గ‌డిస్తే హైద‌రాబాద్‌ లో ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ స‌మావేశాల‌కు చంద్ర‌బాబు హాజ‌రువుతార‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కేసీఆర్ చండీయాగానికి ఆహ్వానించాలి అనుకుంటే ఈ స‌మ‌యంలో భేషుగ్గా ఆహ్వానించ‌వ‌చ్చు కానీ ప్ర‌త్యేకంగా హెలీకాప్ట‌ర్ వేసుకొని మ‌రీ విజ‌య‌వాడ వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు! కానీ కేసీఆర్ అదే పని చేశారు!! దీని వెనుక ఉన్న మ‌ర్మంపై టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఆస‌క్తిక‌ర స‌మాచారం ఇస్తున్నాయి.

ప్ర‌త్యేకంగా విజ‌య‌వాడ‌కు వెళ్ల‌డం ద్వారా "ఇదే మీ రాజ‌ధాని, మీ సొంత ప్రాంతం ఇదే" అనే భావ‌న‌లో బాబును ఫిక్స్ చేసేందుకే కేసీఆర్ ప్ర‌త్యేకంగా ఆంధ్ర‌ప్రదేశ్ గ‌డ్డ‌పై అడుగుపెట్టార‌ట‌. త‌ద్వారా బాబుకు "హైద‌రాబాద్ మీది కాదు" అని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్ల‌యింది. అంతే కాకుండా గ్రేట‌ర్ ప‌రిధిలో ఉన్న సీమాంధ్రుల్లో పాజిటివ్ ఇమేజ్‌ ను పొందేందుకు కేసీఆర్ ఈ ప్లాన్ వేశార‌ని చెప్తున్నారు. సుహృద్భావ వాతావ‌ర‌ణాన్ని పెంపొందించ‌డంలో కేసీఆర్ ముందున్నార‌నే భావ‌న‌ను సీమాంధ్రుల్లో ముఖ్యంగా హైద‌రాబాద్‌ లో ఉన్న సెటిల‌ర్ల‌లో ప్రోదిచేశార‌ని వివ‌రిస్తున్నారు. ఈ స్టెప్ ద్వారా కేసీఆర్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల కోసం మ‌రో కీల‌క ముంద‌డుగు వేసిన‌ట్ల‌యింద‌ని వివ‌రిస్తున్నారు.
Tags:    

Similar News