కేసీఆర్ ఒంటరి సెంటిమెంట్.. జనాలకు చేరువ..

Update: 2018-11-29 11:26 GMT
సింహం సింగిల్ గా వస్తుంది.. అంటున్నారు కేసీఆర్. తెలంగాణ ఎన్నికల వేళ ఊపుగా ప్రచారంలోకి దూసుకెళ్తున్న ఆయన మాటల తూటాలను బలంగా ప్రజల్లోకి వెళ్లేలా పేల్చుతున్నారు. అలా పేల్చిన ఓ మాట ఇప్పుడు బాగా పాపులర్ అయిపోయింది. అదే ‘‘బక్కోణ్ణి కొట్టేందుకు అందరూ మోపయ్యారు అని’’.ఇది జనంలోకి విస్తృతంగా వెళ్లి కేసీఆర్ పట్ల సానుభూతికి కారణమవుతోందట.. తాజాగా ఈ పదం టీఆర్ఎస్ కు కొండంత బలాన్ని ప్రజల నుంచి తీసుకొస్తోందని నేతలు గ్రహించారట..

తెలంగాణ అంటేనే సెంటిమెంట్. ముందస్తు వెళ్లిన కేసీఆర్ అదే ఊపులో క్యాండెట్లను ప్రకటించడం, ప్రచారంలోకి వెళ్లిపోయారు. ప్రచార సమయం ముగుస్తున్న వేళ రోజుకు 8 నుంచి 10 వరకు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల గెలపు బాధ్యతలను ఆయన భజస్కందాలపై వేసుకుని హెలికాప్టర్ లో గంటకో ఊరు తిరుగుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు.

తెలంగాణాలో ఎన్నికలు టీఆర్ఎస్, మహా కూటమి మధ్యే జరుగుతున్నాయి. ఒక్క కేసీఆర్ మాత్రమే ప్రచారంలో పాల్గొని తాను చేసింది, చేయదల్చుకుంది చెప్పేస్తున్నారు. అందుకు దీటుగా మహా కూటమి తరుపున ప్రచారం చేసేందుకు స్టార్ క్యాంపెయినర్  హూదాలో విజయశాంతి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు - కాసాని జ్ఞానేశ్వర్ - కారెం శివాజీ - మంద కృష్ణ మాదిగ, రాహుల్ గాంధీ - సోనియా గాంధీ - అజహరుద్దీన్ - నగ్మా - బాలకృష్ణ మరికొంత మంది నటులు ప్రచారంలో పాల్గొంటున్నారు, పాల్గొనబోతున్నారు.

ఈ లిస్టును చూపుతూ కేసీఆర్ బహిరంగ సభలో నవ్వుతూ ఓ మాట అనేశారు.. ‘‘ ఒక్క బక్కోడిని కొట్టేందుకు అందరూ మోపవుతున్నారు’’ అని. ఆయన నవ్వుతూ ఉన్నా - అందరినీ నవ్వు తెప్పిస్తున్న ఆ మాట అందరిని ఆలోచింప చేస్తోందట.. ఆ బక్కోడి సెంటిమెంట్ ఈ సారి ఎన్నికల్లో గట్టెక్కిస్తుందేమోనని గులాబీ శ్రేణులు ఆశిస్తూ.. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. చూద్దాం మరి కేసీఆర్ సెంటిమెంట్ ఏం మేరకు వర్కవుట్ అవుతుందో..
    

Tags:    

Similar News