కేసీఆర్‌కు మరోసారి అస్వస్థత

Update: 2015-07-09 09:36 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆ మధ్యన ఫాంహౌస్‌లో నాలుగు రోజులు గడిపిన తర్వాత.. విధులకు హాజరైన ఆయన అనారోగ్యానికి గురయ్యారు. స్వల్పంగా జ్వరం వచ్చిందన్న మాట వినిపించింది.

దీంతో.. వైద్యులు పరీక్షలు జరిపి విశ్రాంతి తీసుకోవాలని చెప్పటం.. ఆయన ఆ రోజు హాజరు కావాల్సిన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేయటం తెలిసిందే. చాలా స్వల్ప వ్యవధిలోనే మరోసారి కేసీఆర్‌ అనారోగ్యానికి గురయ్యారు.

తాజాగా ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. దీంతో ఆయన చేపట్టాల్సిన ఖమ్మం.. వరంగల్‌ జిల్లాల పర్యటనలు వాయిదా పడ్డాయి. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆయనీ జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే.. అస్వస్థత కారణంగా ఆ కార్యక్రమాల్ని రద్దు చేశారు.



Tags:    

Similar News